Begin typing your search above and press return to search.

ఆదికేశవ.. మరో పెద్ద మైనస్ ఏమిటంటే!

అయితే ఆదికేశవ సినిమాలో మాత్రం జోజు జార్జ్‌ ని దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి రొటీన్ రాయలసీమ ఫ్యాక్షన్ విలన్ గా చూపించారు. ఈ తరహా పాత్రలని ఇప్పటి వరకు టాలీవుడ్ లో చాలా మంది చేసేశారు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 4:05 AM GMT
ఆదికేశవ.. మరో పెద్ద మైనస్ ఏమిటంటే!
X

మలయాళంలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటుడు జోజు జార్జ్‌. విభిన్నమైన కథలతో మలయాళంలో వరుస హిట్స్ అందుకుంటున్న ఈ నటుడు ఇతర భాషలలో కూడా సినిమాలు చేస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలతో కెరియర్ స్టార్ట్ చేసిన జోజు జార్జ్‌ ఇప్పుడు విలక్షణ నటుడిగా మారిపోయాడు. మోస్ట్ డిమాండ్ యాక్టర్ అనిపించుకున్నాడు.

అతని నుంచి వచ్చిన నాయట్టు, ఇరట్టు సినిమాలు మలయాళంలో సూపర్ హిట్ అయ్యాయి. లుక్స్ తోనే పెర్ఫార్మెన్స్ చేసే యాక్టర్ గా జోజు జార్జ్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి యాక్టర్ తెలుగులో ఆదికేశవ సినిమాలో ప్రతినాయకుడిగా నటించారు. జోజు జార్జ్‌ గురించి అవగాహన ఉన్న ఎవరైనా కూడా అతను తెలుగులో డెబ్యూ చేస్తున్నాడు అంటే కచ్చితంగా క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తారు.

అయితే ఆదికేశవ సినిమాలో మాత్రం జోజు జార్జ్‌ ని దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి రొటీన్ రాయలసీమ ఫ్యాక్షన్ విలన్ గా చూపించారు. ఈ తరహా పాత్రలని ఇప్పటి వరకు టాలీవుడ్ లో చాలా మంది చేసేశారు. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అనే అందులో గొప్పగా చెప్పుకునేంత పెర్ఫార్మెన్స్ ఏమీ ఉండదు. అందుకు తగ్గట్లుగానే ఆదికేశవ సినిమాలో జోజు జార్జ్‌ నుంచి నెక్స్ట్ లెవల్ పెర్ఫార్మెన్స్ ఏమీ రాలేదు.

ఈ యాక్టర్ కూడా ఆ ఫ్యాక్షనిస్ట్ పాత్రని చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. దర్శకుడు కూడా అలాంటి యాక్టర్ ని తీసుకొని కొత్తగా ఏదైనా ట్రై చేస్తాడని అనుకుంటే రొటీన్ ఫార్మాట్ లో చూపించేశారు. దీంతో ప్రేక్షకులు నిరాశకి గురయ్యారు. మంచి టాలెంటెడ్ యాక్టర్ ని సరిగ్గా వినియోగించుకోలేకపోయారు అనే విమర్శలు ఆదికేశవ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి.

నిజానికి వైష్ణవ్ తేజ్ ఈ కథని ఎంపిక చేసుకోవడమే రాంగ్ ఛాయస్ అని, అలాగే సినిమాలో ఒక్క శ్రీలీల తప్ప గొప్పగా చెప్పుకునే ఎలిమెంట్స్ ఏవీ లేవని తేల్చేశారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన వీకెండ్ పూర్తి కాకుండానే ప్యాకప్ చెప్పెసేలా మూవీ ఉందని సినీ విశ్లేషకులు అంటున్న మాట. మొత్తానికి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అయిన జోజు జార్జ్‌ తెలుగు డెబ్యూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందనేది సోషల్ మీడియాలో వినిపిస్తోన్న టాక్.