వాళ్ల రికార్డులనే చెరిపేసేలా ఓటీటీ లో ప్లాప్ రిలీజ్!
హాలీవుడ్ చిత్రం `జోకర్` సీక్వెల్ `ఫోలీ ఎ డ్యూక్స్ `జోకర్-2` భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 Oct 2024 9:42 AM GMTహాలీవుడ్ చిత్రం `జోకర్` సీక్వెల్ `ఫోలీ ఎ డ్యూక్స్ `జోకర్-2` భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమా `జోకర్` భారీ విజయం సాధించడంతో రెండవ భాగం అంత కంతకు అంచనాల మధ్య రిలీజ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రమిది. అయితే ఈ సినిమా రిలీజ్ అనంతరం అంచనాలు అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
తొలి షో అనంతరం పబ్లిక్ టాక్...రివ్యూలు ఏమాత్రం ఆశాజనకంగా రాలేదు. కొన్ని రోజులకే బాక్సాఫీస్ వద్ద తేలిపోయిన చిత్రంగా మారిపోయింది. అయితే ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవ్వడం అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. రిలీజ్ అయిన నెల రోజుల్లోనే స్ట్రీమీంగ్ కి రావడంతో అతి పెద్ద డిజాస్టర్ గా హైలైట్ అవుతుంది. ఇంత వరకూ ఏ హాలీవుడ్ సినిమా నెల వ్యవధిలో రిలీజ్ అవ్వలేదు.
ఓటీటీ కండీషన్ ప్రకారం రిలీజ్ అయ్యేది. కానీ `జోకర్-2` ఓటీటీ కండీషన్ నే బ్రేక్ చేసి ముందొస్తుగా రిలీజ్ అవుతుంది. దీంతో జోకర్ ప్రాంచైజీ అభిమానులు తమ నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది చిత్రాన్ని ఓటీటీలో చూడాలని ఆసక్తిగా ఎదురు చూసే వాళ్లు ఉన్నారు. వాళ్లందరికీ పండగే. ఒక టికెట్ పై ఫ్యామిలీలో అంతా కలిసి కూర్చుని చేసే వెసులు బాటు ఇక్కడ దొరుకుతుంది.
మరి ఓటీటీ రిలీజ్ లో ఎలాంటి ఫలితాలు సాధిస్తుందన్నది చూడాలి. థియేటర్లో ప్లాప్ అయిన చాలా చిత్రాలకు కొన్నిసార్లు ఓటీటీలోనూ మంచి ఆదరణ లభించింది. అప్పట్లో ఖలేజే సినిమా థియేటర్లో ప్లాప్ అయినా? టీవీల్లో మాత్రం జనాలు ఎగబడి చూసినట్లు!