రెండు దశాబ్ధాలుగా సంగీతంలో బ్రదర్స్ హవా!
మునుముందు సరికొత్త ప్రణాళికలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల ముందుకు వస్తున్నారు.
By: Tupaki Desk | 14 Feb 2025 3:20 AM GMT20 సంవత్సరాలుగా జోనాస్ బ్రదర్స్ నిక్- కెవిన్- జో త్రయం ఎదుగుతూనే ఉన్నారు. డిస్నీ ఛానల్ షోలు మొదలు, గొప్ప సంగీత నౌకనే నడిపించారు బ్రదర్స్. మునుముందు సరికొత్త ప్రణాళికలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల ముందుకు వస్తున్నారు.
''మేం విజయాలను సెలబ్రేట్ చేసుకున్నాం. తప్పులు చేసాము.. సవాళ్లను అధిగమించాము.. నష్టాలకు విచారించాము. చాలా సింపుల్‌గా చెప్పాలంటే మేమంతా కలిసి పెరిగాం''అని అన్నారు జోనాస్ బ్రదర్స్. కలిసి మా ప్రయాణాన్ని ప్రారంభించి 20 సంవత్సరాలు అయ్యిందని వారు చెప్పారు. ఇకపైనా జోనాస్ బ్రదర్స్ 2.0 ఆలోచనలతో దూసుకొస్తున్నారు. కొత్త జోనాస్ బ్రదర్స్ సంగీతం, సోలో ప్రాజెక్టులు, లైవ్ పెర్ఫామెన్స్ ఆల్బమ్ లు , ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ కోసం ప్రణాళికలను వెల్లడించారు. నిక్ జోనాస్ ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్ స్ప్రింగ్ 2025లో బ్రాడ్‌వేకి తిరిగి రానున్నారు. జోనాస్ బ్రదర్స్ మోస్ట్ అవటెడ్ హాలిడే చిత్రం 2025 లోనే ప్రారంభమవుతుంది.
జోనాస్ బ్రదర్స్ నెక్ట్స్ ఏంటి? అంటే... తదుపరి సక్కర్మ్ నుంచి కొత్త మ్యూజిక్ వీడియోతో బరిలో దిగుతున్నారు. ఈ వీడియో ఆల్బమ్ సంగతి వదిలేస్తే ఒక ప్రశ్న మిగిలి ఉంది. ప్రియాంక చోప్రా 2019 సక్కర్ ఆల్బమ్ లో కనిపించింది. ఇప్పుడు జోనాస్ బ్రదర్స్ తదుపరి మ్యూజిక్ ఆల్బమ్స్‌లో వారితో పాటు కలిసి పని చేస్తారా? అన్నది చూడాలి. 2023లో జో జోనాస్ - సోఫీ టర్నర్ విడాకులు తదుపరి ప్రాజెక్టులకు కొంత ఇబ్బందికర పరిణామం. భవిష్యత్తులో జోనాస్ బ్రదర్స్ ఒక కొత్త తారను టీమ్ కు జోడిస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు.