Begin typing your search above and press return to search.

ప్రపంచాన్ని షేక్‌ చేసిన నిర్మాత కన్నుమూత

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులకు కొన్ని సినిమాల పేర్లు సుపరిచితం.

By:  Tupaki Desk   |   7 July 2024 10:54 AM GMT
ప్రపంచాన్ని షేక్‌ చేసిన నిర్మాత కన్నుమూత
X

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులకు కొన్ని సినిమాల పేర్లు సుపరిచితం. వాటిల్లో టైటానిక్ మరియు అవతార్ లు ముందు ఉంటాయి అనడంలో సందేహం లేదు. టైటానిక్ వచ్చి నాలుగు దశాబ్దాలు అవుతున్నా కూడా ఇంకా ఆ సినిమా క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు విడుదల చేసిన వందల కోట్ల వసూళ్లు ఆ సినిమా రాబట్టడం ఖాయం.

ఇక అవతార్ సినిమాతో ప్రపంచ సినీ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచం లోకి తీసుకు వెళ్లారు. ఈ రెండు సినిమాలను రూపొందించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ అయితే ఆయన వెనుక ఉండి నడిపించింది మాత్రం జోన్ లాండౌ. ప్రపంచం మెచ్చిన సినిమాలను నిర్మించిన జోన్ లాండౌ కన్నుమూశారు.

గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న లాండౌ ఆరోగ్యం మరింతగా విషమించడంతో తుది శ్వాస విడిచినట్లు ఫ్యామిలీ మెంబర్స్ ప్రకటించారు. లాండౌ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

1980 లో ప్రొడక్షన్‌ హౌస్ ను ఏర్పాటు చేసిన జోన్ లాండౌ ఏ సినిమా పడితే అది తీయకుండా ఇప్పటి వరకు అవతార్‌ 4 పార్ట్‌ లతో కలిపి కేవలం 8 సినిమాలను మాత్రమే నిర్మించాడు. ఈయన నిర్మించిన సినిమాల్లో 14 ఆస్కార్ నామినేషన్స్‌ ను సొంతం చేసుకోగా 11 ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకున్నాయి.

టైటానిక్ కోసం భారీగా ఖర్చు చేస్తున్న సమయంలో చాలా మంది ఈయన తీరును తప్పుబట్టారట. కానీ దర్శకుడిపై నమ్మకం, మరియు కంటెంట్‌ పై నమ్మకంతో భారీగా ఖర్చు పెట్టాడు. ఆ సినిమా సాధించిన వసూళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. కనీసం ఊహకు కూడా అందని స్థాయిలో అప్పట్లో టైటానిక్‌ వసూళ్లు నమోదు అయ్యాయి.

జోన్ లాండౌ నిర్మించిన అవతార్ 3 మరియు అవతార్ 4 లు విడుదల అవ్వకుండానే కన్ను మూయడం విచారకరం అంటూ ఆయన సన్నిహితులు మరియు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమాను నమ్మితే ఎంతైనా ఖర్చు పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు అయినా వెయిట్‌ చేయాలి అని నిర్మాత జోన్ లాండౌ నుంచి ఈతరం నిర్మాతలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.