Begin typing your search above and press return to search.

జోరుగా హుషారుగా ట్రైలర్.. ఎలా ఉందంటే..

ఇక 'ఉప్పెన' తో బాక్సాఫీస్ హిట్ సొంతం చేసుకున్న సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా చేతుల మీదుగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 8:29 AM GMT
జోరుగా హుషారుగా ట్రైలర్.. ఎలా ఉందంటే..
X

'బేబీ' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు అందుకున్న నటుడు విరాజ్ అశ్విన్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ 'జోరుగా హుషారుగా'. పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటించిన ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు అను ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఇక శిఖర & అక్షర ఆర్ట్స్ LLP బ్యానర్ లో నిరీష్ తిరువీదుల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.


ఇక 'ఉప్పెన' తో బాక్సాఫీస్ హిట్ సొంతం చేసుకున్న సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా చేతుల మీదుగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను విడుదల చేసిన బుచ్చిబాబు సినిమా కంటెంట్‌ను మెచ్చుకున్నారు. అలాగే విరాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్‌ వివరాల్లోకి వెళితే సాయి కుమార్‌ సింపుల్ క్యారెక్టర్ తో ఆస్తుల కంటే మనుషుల బంధం గొప్పది అని అర్థవంతమైన డైలాగ్ తో హైలెట్ చేశారు.


ఇక మిడిల్ క్లాస్ ఆశలతో ఉండే అతని కొడుకు విరాజ్ క్యారెక్టర్ తన ఆఫీసులోనే మరొక అమ్మాయితో ప్రేమలో పడే సన్నివేశాలు కూడా ఇందులో మేజర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ప్రేమలో అతనికి ఎదురైన చాలెంజ్ లు కుటుంబంలో కూడా ప్రభావం చూపుతాయని అర్థమవుతుంది. ఇక తండ్రి కొడుకులు మధ్యలో ఉండే బంధం ఏమిటి అలాగే అతని ప్రేమతో వచ్చిన ఇబ్బందులు ఏంటి అని అంశాలు సినిమాలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది.


ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మంచి లవ్ స్టోరీ అలాగే కామెడీ కూడా హైలెట్ కాబోతున్నట్లు ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. సినిమాలో బ్రహ్మాజీ పోషించినారు చర్చి ఫాదర్ క్యారెక్టర్ బాగా నవ్విస్తుందని అర్థం అవుతుంది. రొమ్-కామ్ సన్నివేశాలలో మధునందన్ కూడా ఉన్నారు. సిరి హనుమంతు మరో సిటీ అమ్మాయిగా నటించారు.

టైటిల్‌లోనే సినిమా ఫన్‌తో నిండిపోయింది. ఇక ఇది చెప్పుకోదగ్గ థియేట్రికల్ హిట్ అవుతుందని హీరో విరాజ్ ఆశిస్తున్నాడు. ఇక డిసెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమా ఆడియెన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.