మ్యాన్ ఆప్ మాసెస్ గందరగోళానికి గురైన రోజులవి!
కేవలం తన ట్యాలెంట్ తో మాత్రమే పైకొచ్చిన నటుడు. తాజాగా తారక్ కెరీర్ ఒకానొక దశలో గందర గోళానికి గురైన విషయాన్ని రివీల్ చేసాడు.
By: Tupaki Desk | 11 Nov 2024 7:30 PM GMTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎదిగిన వైనం గురించి చెప్పాల్సిన పనిలేదు. నందమూరి హరికృష్ణ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తారక్ నేడు పాన్ ఇండియా స్టార్. నటుడిగా, డాన్సర్ గా , హెస్ట్ గా అతడి ప్రతిభ గురించి చెప్పాల్సిన పనిలేదు. నందమూరి వారసత్వంతో ఎంట్రీ ఇచ్చినా? ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగిన నటుల్లో తారక్ ఒకరు. కేవలం తన ట్యాలెంట్ తో మాత్రమే పైకొచ్చిన నటుడు. తాజాగా తారక్ కెరీర్ ఒకానొక దశలో గందర గోళానికి గురైన విషయాన్ని రివీల్ చేసాడు.
అదేంటో ఆయన మాటల్లోనే..' నేను టీనేజ్లోనే 'నిన్ను చూడాలని', 'స్టూడెంట్ నెంబర్ వన్', 'సుబ్బు' ఇలా వరుసగా సినిమాలు చేయడంతో నా గ్రాఫ్ పెరిగింది. కానీ కొన్నాళ్లకు వైఫల్యాలు ఎదురయ్యాయి. ఆ దశలో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. చాలా గందరగోళంగా అనిపించేది. నేను ఎంచుకునే పాత్రలు సరైనివేనా? అనుకునేవాడిని. ఏం చేయాలో తెలిసేది కాదు. అప్పుడు రాజమౌళి నా దగ్గరకొచ్చి నీనటన సమీక్షంచుకో అని సలహా ఇచ్చారు.
ఓ దర్శకుడిగా కొన్ని సూచనలు చేసారు. దీంతో నా ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. కథల ఎంపిక విధానం మారింది. కొత్తగా ఆలోచించచడం, ఆతరహాలో కథలు ఎంచుకోవడం మొదలు పెట్టాను. కంపర్ట్ జోన్ వదిలి కొత్తగా ప్రయోగాలు మొదలు పెట్టాను. వాటి విజయాల గురించి పక్కన బెడితే ఓ నటుడిగా నాకెంతో సంతృప్తిని అందించిన సినిమాలవి. ఆ దశ నాకెన్నో పాఠాలు నేర్పింది' అన్నాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. పాన్ ఇండియా కంటెంట్ తో తెరకెక్కుతోంది. ఇటీవలే తారక్ 'దేవర'తో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రశాంత్ నీల్ సలార్ తోనూ మరోసారి భారీ విజయం దక్కించుకున్నాడు. ఇప్పుడీ కాంబోలో సినిమాతో అంచనాలు పీక్స్ కి చేరాయి.