Begin typing your search above and press return to search.

వీడియో : బావమరిదితో ఎన్టీఆర్ బాండింగ్ చూశారా?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, యువ కథానాయకుడు నార్నే నితిన్ గురించి అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Nov 2024 7:28 AM GMT
వీడియో : బావమరిదితో ఎన్టీఆర్ బాండింగ్ చూశారా?
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, యువ కథానాయకుడు నార్నే నితిన్ గురించి అందరికీ తెలిసిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కొడుకైన నితిన్.. తారక్ బావమరిది (లక్ష్మీ ప్రణతి సోదరుడు)గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాతో హిట్ అందుకున్నారు.


ఆ తర్వాత రీసెంట్ గా ఆయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అంజి మణిపుత్ర దర్శకత్వం వహించిన ఆ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌ పై బన్నీ వాస్ నిర్మించారు. స్వచ్చమైన గోదావరి సినిమాగా వచ్చిన ఆయ్.. సినీ ప్రియులను తెగ మెప్పించింది. నార్నే నితిన్ ఫేమ్ కూడా పెంచేసింది. అయితే తన బావమరిది హీరోగా పరిచయం అయినప్పటి నుంచి వివిధ రకాలుగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు తారక్.

ఎన్టీఆర్, నితిన్ మధ్య మంచి బాండింగ్ ఉందని ఎప్పుడూ వార్తలు వస్తుంటాయి. ఇప్పుడు మరోసారి అది ప్రూవ్ అయిందని నెటిజన్లు చెబుతున్నారు. అందుకు ఎగ్జాంపుల్ గా నార్నే నితిన్ ఎంగేజ్మెంట్ వీడియోను చూపిస్తున్నారు. నిజానికి.. తారక్ బావమరిది నిశ్చితార్థ వేడుక నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్‌- స్వరూప దంపతుల కుమార్తె శివానితో త్వరలో ఏడడుగులు నడవనున్నారు నితిన్.

తాళ్లూరి కుటుంబానికి సీనియర్ హీరో వెంకటేష్ ఫ్యామిలీతో బంధుత్వం ఉన్నట్టు సమాచారం. అయితే నితిన్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కు తారక్ తన భార్య లక్ష్మీ ప్రణతి, కొడుకులు అభయ్‌, భార్గవ్‌ తో హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో వేదికపై నితిన్, శివానితో ఫోటోస్ దిగారు. అప్పుడు నితిన్, తారక్ ఏదో మాట్లాడుతూ కనిపించారు. వేడుక సంబంధించి డిస్కస్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

వేదిక దిగేముందు తారక్.. తన బావమరిది వెన్నుతట్టి చాలా క్లోజ్ గా కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. దీంతో బావాబావమరదుల మధ్య బాండింగ్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తారక్ అన్న హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. నార్నే ఇంటి అల్లుడు అయిన ఎన్టీఆర్.. తన వంతు బాధ్యతగా వేడుకకు సంబంధించిన బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తున్నట్లు కనిపిస్తుందని అంటున్నారు.