Begin typing your search above and press return to search.

జపాన్‌లో తారక్ స్టైల్ ధ‌మాకా.. స్టన్నింగ్ లుక్!

ఈ నేపథ్యంలో ‘దేవర’ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో ప్రమోట్ చేయాలని చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది.

By:  Tupaki Desk   |   24 March 2025 4:52 PM IST
జపాన్‌లో తారక్ స్టైల్ ధ‌మాకా.. స్టన్నింగ్ లుక్!
X

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా మొదటి భాగం వచ్చే నెల 28న జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలుగులో విడుదలైన బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించడంతో, ఇప్పుడు అదే ఊపుతో జపాన్ లో కూడా సక్సెస్ అవుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.


‘RRR’ ద్వారా జపాన్‌లో ఎన్టీఆర్‌కు ఏర్పడిన ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. అక్కడి ప్రేక్షకులు అతని నటనను, డెడికేషన్‌ను ఎంతో ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘దేవర’ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో ప్రమోట్ చేయాలని చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. జపాన్ టూర్‌లో భాగంగా ఎన్టీఆర్ ఇప్పటికే పలు మీడియా ఇంటర్వ్యూలు, ఫొటోషూట్లు నిర్వహిస్తున్నారు.


ఇప్పుడు జపాన్‌లోని ఓ స్టార్ హోటల్‌లో దిగిన ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోడర్న్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపించిన ఎన్టీఆర్, తన కూల్ స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. బ్లాక్ షర్ట్, బాగీ ప్యాంట్, మ్యాచింగ్ షూస్, స్టైలిష్ సన్‌గ్లాస్‌లు ధరించిన తారక్ లుక్ పర్ఫెక్ట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

విండో పక్కన లెజెండరీ పోజ్‌తో నిలబడి ఇచ్చిన ఈ స్టైలిష్ షాట్‌కి అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. "స్టైల్ అంటే ఇదే.. ఎన్టీఆర్ క్లాస్ అండ్ మాస్ కాంబినేషన్ ని ఎవరీ బీట్ చేయలేరు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు.. ఈ లుక్ చూస్తుంటే దేవర జపాన్‌లో సంచలనం సృష్టించబోతున్నట్లే ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా, దేవర లో ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటించగా, అనిరుధ్ సంగీతం అంధించారు.

నందమూరి కల్యాణ్‌రామ్ కలిసి నిర్మించిన ఈ ప్రాజెక్ట్ తొలి భాగం విజయవంతం కావడంతో, త్వరలోనే రెండో భాగం షూటింగ్ మొదలుకాబోతోంది. ఇక జపాన్ ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ మీడియాతో పాటు ఫ్యాన్స్ సమావేశాల్లోనూ పాల్గొనబోతున్నాడు. స్టైలిష్ లుక్‌తో టాలీవుడ్ స్టామినాను అంతర్జాతీయంగా పరిచయం చేస్తున్న తారక్, జపాన్‌లో మరోసారి తన మార్క్ చూపించబోతున్నాడు. జపాన్ అభిమానుల హైప్ చూస్తుంటే, దేవర అక్కడ భారీ ఓపెనింగ్ ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.