Begin typing your search above and press return to search.

జపాన్ గడ్డపై దేవర ఆట మొదలైనట్లే..

RRR సినిమాతో గ్లోబల్ రేంజ్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ దేవర సినిమాతో కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   24 March 2025 10:48 AM IST
Jr Ntr Attend Devara Promotions In Japan
X

RRR సినిమాతో గ్లోబల్ రేంజ్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ దేవర సినిమాతో కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు జపాన్ లో మరోసారి సందడి చేస్తున్నారు. గత ఏడాది పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ‘దేవర’ సినిమాను జపాన్ లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా తారక్ తన భార్య ప్రణతి తో కలిసి జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడికే వెళ్లి మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించారు.


‘RRR’ సినిమా జపాన్ లో కలెక్షన్ల పరంగా ఒక మైలురాయిగా నిలిచింది. తారక్‌కి అక్కడ సూపర్ స్టార్ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌ను ఇప్పుడే దేవర టీమ్ సరిగ్గా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. తారక్, కొరటాల శివ జపాన్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కొన్ని ఫోటోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. తారక్ చిరునవ్వుతో ఇచ్చిన లుక్, డైరెక్టర్ కొరటాల శివ ప్రెజెంటేషన్ చూస్తేనే వారి కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది.

జపాన్ రిలీజ్‌కు ముందే అక్కడి మీడియా ద్వారా ప్రచారాన్ని బలోపేతం చేయడం దేవర టీమ్ బిజినెస్ పరంగా తీసుకున్న అద్భుతమైన నిర్ణయంగా కనిపిస్తోంది. ఈ నెల 28న జపాన్‌లో విడుదల కానున్న ‘దేవర’ అక్కడ మంచి ఓపెనింగ్స్ నమోదు చేయడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇది కేవలం ఓ రిలీజ్ కాదు, జపాన్ మార్కెట్‌లో తారక్ స్థాయిని మరోసారి స్థిరపరిచే అవకాశం. అంతేకాకుండా దేవర పార్ట్ 2 కోసం బజ్ పెరగడం ఖాయం.

ఈ మూవీకి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, అనిరుధ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రమోషన్స్ మంచి టాక్ రావడంతో, ఇప్పుడు జపాన్ రిలీజ్ మరింత స్పెషల్ అయింది. గ‌తంలో RRR జపాన్‌లో యాదృచ్ఛికంగా విజయాన్ని అందుకున్నా, ఈసారి దేవర విషయంలో ప్లాన్డ్ ప్ర‌మోష‌న్‌తో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. జపాన్‌లో విడుదలవుతున్న టాలీవుడ్ సినిమాల సంఖ్య పెరగడం, మార్కెట్ విస్తరణకు ఇది ఒక కొత్త దారి కానుంది.

మొత్తానికి తారక్, కొరటాల శివ లాంటి క్రేజీ కాంబినేషన్ జపాన్‌లో 'దేవర' ప్రమోషన్ కోసం పయనించడంతో, ఈ చిత్రం అక్కడ ఒక సంచలన విజయం సాధించనున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక దేవర సక్సెస్‌తో పాటు, ఈ జపాన్ ట్రిప్ తర్వాత తారక్ తదుపరి ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. రాబోయే రోజుల్లో తారక్ హవా అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.