టైగర్ షూస్ కాస్ట్ కి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారా?
అయితే ఎన్టీఆర్ వేసుకున్న మోడల్ షూస్ ధర 995 డాలర్లు ఉంది. అంటే మన రూపాయల్లో 80 వేల రూపాయలకు పైనే. ఆ ధర తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.
By: Tupaki Desk | 10 Sep 2024 7:42 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సిప్లిసిటీలోనే రిచ్ లుక్ ని హైలైట్ చేయడం అతడి ప్రత్యేకత. జీన్స్...క్యాజువల్స్ షర్ట్ లో తానో బ్రాండ్ అని చెబుతుంటాడు. బ్రాండెడ్ దుస్తుల్లో ఎన్టీఆర్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుం టాయి. వాటి ధర ఎంత అంటే? నెటి జనుల్లో చర్చకు తెర తీయడం అతడి ప్రత్యేకత. తాజాగా ఎన్టీఆర్ 'దేవర' ప్రచారంలో భాగంగా ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ బాలీవుడ్ వాళ్ళని కలుస్తున్నాడు.
ఫోటో గ్రాఫర్లకు ఫోజులిస్తున్నాడు. అలా వచ్చిన ఓ క్లికప్ పై నెట్టింట చర్చకు దారి తీసింది. ఇదిగో ఇక్కడిలా ఎన్టీఆర్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్న స్టైలిష్ షూ వేసుకొని ఉన్నాడు. విదేశాలకు చెందిన ఓ బ్రాండెడ్ కంపెనీ షూ అది. దీంతో ఈ షూస్ ఎంత ధర ఎంతనే చర్చ మొదలైంది. అభిమనులు, నెటి జనులు నెట్టింట ధర వెతకడం మొదలు పెట్టారు. ఈ కంపెనీ షూస్ ప్రారంధ ధర 40 వేల నుంచి ఉంది.
ఈ బ్రాండ్ లో లక్ష రూపాయల పైన ఉన్న షూస్ కూడా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ వేసుకున్న మోడల్ షూస్ ధర 995 డాలర్లు ఉంది. అంటే మన రూపాయల్లో 80 వేల రూపాయలకు పైనే. ఆ ధర తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంత ఖరీదైన షూట్ తారక్ వాడుతున్నాడా? అంటూ అంతా చర్చించుకుంటున్నారు. హీరోలకు ఏంటి? ఎంత ఖరీదైన షూట్ అయినా వాడతారు. ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషికం తీసుకుంటారు.
అందులో తారక్ బ్రాండ్ విషయంలో అస్సలు తగ్గడు. ఖరీదైన లంబోర్గీ కారు ఉన్న వాళ్లలో తారక్ ఒకరు అన్న సంగతి తెలిసిందే. పైగా ముంబైలో ప్రచారానికి హాజరయ్యారు? అంటే అందుకు తగ్గట్టు ఉండాల్సిందే. షూస్ కే షాక్ అయితే ఎలా కోట్లలో ఖరీదు చేసే బ్రాండెడ్ వాచ్ లు తారక్ దగ్గర ఎన్నో ఉన్నాయి. వాటితో పోలిస్తే ఈ షూస్ ధర ఎంత.