ఎన్టీఆర్.. మళ్ళీ ఈ 'కంత్రి' లుక్కేంటి?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడూ కొత్త లుక్‌తో కనిపించినా, అది వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
By: Tupaki Desk | 5 April 2025 4:49 AMయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడూ కొత్త లుక్‌తో కనిపించినా, అది వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. లేటెస్ట్ మ్యాడ్ స్క్వైర్ సక్సెస్ ఈవెంట్ కు హాజరైన సందర్భంగా కనిపించిన లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మాటింది. ఎన్టీఆర్ నిన్న ఉదయం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఓ కమర్షియల్ యాడ్ షూట్ చేసినట్లు సమాచారం. ఇక ఇద్దరూ అటు నుంచే ఈవెంట్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.
చాలా లీన్ గా ట్రిమ్ లుక్‌తో ఎన్టీఆర్ కనిపించడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఇదే సమయంలో ఈ లుక్ వెనుక బలమైన రీజన్ ఉండొచ్చోనన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈ లుక్‌లో ఎన్టీఆర్‌ను చూసిన తర్వాత చాలామంది అతడి పాత సినిమా కంత్రి లాంటి లుక్ అని కామెంట్ చేస్తున్నారు. యమదొంగ లో కాస్త సన్నగా పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా కంత్రి సమయానికి కాస్త డిఫరెంట్ గా మారింది. ఆ లుక్ ఓ వర్గం ఫ్యాన్స్ కు అసలు నచ్చలేదు.
ఇక మళ్ళీ ఇప్పుడు దాదాపు అదే లుక్ తో ఉన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే "డ్రాగన్" సినిమాలో ఎన్టీఆర్ ఈ స్లిమ్ లుక్‌లోనే కనిపించబోతున్నాడని సమాచారం. ‘కేజీఎఫ్’లో యష్, ‘సలార్’లో ప్రభాస్ బలిష్టంగా కనిపించినట్లు, ఎన్టీఆర్ మాత్రం స్లిమ్ లుక్‌లో చూపించాలనుకుంటున్నారట. ఇది పాత్ర డిమాండ్ అని తెలుస్తోంది. అయితే ఈ కొత్త లుక్‌పై నెటిజన్ల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది.
కొందరు తారక్ చాలా స్టైలిష్‌గా ఉన్నాడు అని మెచ్చుకుంటున్నారు, అయితే మరికొందరు మాత్రం ఎన్టీఆర్‌ను అంత బక్కచిక్కినట్టు చూడటం కొత్తగా ఉంది, తక్కువ బాడీ వాల్యూమ్‌తో అంత ఇంపాక్ట్ కలుగుతుందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ సినిమాటిక్‌గా చూస్తే ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ ఉంటే, ప్రతి మార్పు వెనుక స్ట్రాంగ్ రీజన్ ఉంటుందని చెప్పవచ్చు.
ఇక డ్రాగన్ సినిమా కోసమే తారక్ ఇలా బాడీ ట్రిమ్ చేసినట్లు స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికే ఆయనకు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనుభవం ఎక్కువ. జూనియర్ ఎన్టీఆర్ అన్నాక డెడికేషన్ అంటే ఇదే అనిపించేలా కనిపిస్తున్నాడు. సినిమా కోసం ఎందాకైనా వెళ్లే తారక్ ఈసారి ఫిజికల్‌గా గట్టిగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మరి డ్రాగన్ గర్జనకు ఈ లుక్ కు ఎంతవరకు మ్యాచ్ అవుతుందో చూడాలి.