తారక్.. క్లాస్ లో హై వోల్టేజ్ మాస్
ఈ హైప్ మధ్య తారక్ స్టైల్‌లో ఇచ్చిన ఓ క్లాసీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్‌గా కనిపించారు.
By: Tupaki Desk | 2 April 2025 5:15 PMజూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. టాక్ ఎలా ఉన్నా కూడా తన స్టార్ ఇమేజ్ తో బాక్సాఫీస్ వద్ద మొదటిసారి సోలోగా 500 కోట్ల మార్క్ ను టచ్ చేశాడు. ఇక RRR తో వచ్చిన క్రేజ్ తో దేవర సినిమాను జపాన్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇక తారక్ ప్రమోషన్ కోసం జపాన్ టూర్‌లో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అక్కడ వచ్చిన క్రేజ్‌ను కొనసాగించేలా ఈసారి కూడా ఎన్టీఆర్ స్టైల్, ఎనర్జీతో జపనీస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు.
మార్చి 28న జపాన్‌లో విడుదలైన దేవర పార్ట్ 1 ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుంటోంది. ఈ హైప్ మధ్య తారక్ స్టైల్‌లో ఇచ్చిన ఓ క్లాసీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్‌గా కనిపించారు. బ్లాక్ అండ్ వైడ్ కాంబినేషన్లో షర్ట్, బాగీ ప్యాంట్, సూటబుల్ మ్యాచింగ్ షూస్‌తో పాటు సన్‌గ్లాస్ ధరించి మోడ్రన్ లుక్‌తో కనిపించిన తారక్.. ఫ్యాషన్‌కి డెఫినిషన్‌ను మార్చేశారు.
టోక్యోలో ఓ స్టార్ హోటల్‌లో దిగిన ఈ ఫోటో, అభిమానుల హృదయాలను దోచుకుంటోంది. “స్టైల్ అంటే ఇదే.. తారక్ లుక్ అంతే అదిరిపోయింది” అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. తారక్ విండో పక్కన నిలబడి ఇచ్చిన ఆ సింపుల్ పోజ్‌కి ఎంత పవర్ ఉందంటే, తక్కువ కష్టంతో ఎక్కువ ఇంపాక్ట్ ఎలా సృష్టించాలో చూపించినట్టు ఉంది. అభిమానులు “క్లాస్ లుక్‌తో మాస్ స్టైల్” అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత జపాన్‌లో తారక్‌కి ఏర్పడ్డ ఫాలోయింగ్‌ను నిలబెట్టేందుకు తారక్ తీసుకున్న స్టెప్ ఇది. అభిమానుల ప్రేమను నిలబెట్టుకుంటూ తను ఎంత స్టైలిష్‌గా మారాడో నిరూపించేశారు. దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, అనిరుధ్ మ్యూజిక్ అందించారు. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, తారక్ మాస్ లుక్ సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ముఖ్యంగా జపాన్‌లో ఈ సినిమా విడుదలకు ముందే ఎన్టీఆర్ చేసిన ఫొటోషూట్లు, మీడియా ఇంటర్వ్యూలు, స్టెప్పింగ్ పబ్లిసిటీ అన్నీ కలిపి అక్కడా ఓ మాస్ హైప్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ఈ బజ్‌కి తారక్ స్టైలిష్ లుక్ మరింత బూస్ట్ ఇచ్చాయి.
ఇక జపాన్‌లోని అభిమానులు ఎన్టీఆర్‌కి స్వాగతం పలికే విధానం చూస్తుంటే, ఆయనకు అక్కడ ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఎలాగూ దేవర తొలి భాగం విజయం దిశగా ముందుకు సాగుతుండగా, రెండో భాగానికి కూడా ఇదే ఊపు కొనసాగనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న పార్ట్ 2 త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా, జపాన్ ప్రమోషన్లు పూర్తయిన వెంటనే తారక్ మళ్లీ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌లో బిజీ కానున్నారు.