Begin typing your search above and press return to search.

జూ.సౌంద‌ర్య తీర‌ని అన్యాయం

నిత్యా అత్యుత్తమ నటనా నైపుణ్యాలతో పాటు తనవైన‌ అద్భుత ఫ్యాషన్ ఎంపికలతోను పాపుల‌రైంది.

By:  Tupaki Desk   |   8 Dec 2023 4:15 AM GMT
జూ.సౌంద‌ర్య తీర‌ని అన్యాయం
X

నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జూనియ‌ర్ సౌంద‌ర్య‌గా తెలుగు లోగిళ్ల‌లో పాపుల‌రైంది. ప్రధానంగా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాలలో న‌టించింది. ఇప్ప‌టికే 50కి పైగా సినిమాల్లో నటించిన అనుభ‌వం త‌న సొంతం. నిత్యా అత్యుత్తమ నటనా నైపుణ్యాలతో పాటు తనవైన‌ అద్భుత ఫ్యాషన్ ఎంపికలతోను పాపుల‌రైంది. ఇటీవల నిత్యా తాజా ఫోటో సెషన్ నుండి ఒక అంద‌మైన ఫోటోని షేర్ చేసింది. ఇది ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టించింది.


ఈ ఫోటోలో నిత్యా ఎరుపు- బంగారు రంగులో ముద్రించిన చీరను ధరించి సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా కనిపించింది. ఆ చీర‌కు సరిపోయేలా అలంకరించిన కాంబినేష‌న్ బ్లౌజ్‌తో క‌నిపించింది. నిత్య మినిమ‌ల్ మేకప్ తో సింపుల్ గా క‌నిపించింది. మినిమ‌ల్ నెక్లెస్ సెట్ .. ఎర్రటి బిందీతో తన రూపాన్ని అందంగా మార్చింది. ఆ ఫోటోలు అంత‌ర్జాలంలో క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. అభిమానులు `గార్జియస్` అని పొగిడేసారు. `అందాల రాణి` అని కూడా ప్ర‌శంసించారు. చాలా మంది కామెంట్ బాక్స్‌లో రెడ్ హార్ట్ ఎమోజీల వర్షం కురిపించారు. సాంప్రదాయ వస్త్రధారణలోనే కాదు.. పాశ్చాత్య దుస్తుల్లోనూ నిత్య అందంగా కనిపిస్తుంది. కొన్ని వారాల క్రితం నిత్యా లైమ్ ఎల్లో ఫుల్ స్లీవ్ ప్రింటెడ్ డ్రస్‌లో థై స్లిట్ ఎలివేష‌న్ తో గుండెలు కొల్ల‌గొట్టింది.


1988లో `హనుమాన్` అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నిత్యా మీనన్ కెరీర్ ప్రారంభించింది. తరువాత 2008లో, ఆకాశ గోపురం అనే మలయాళ చిత్రంలో నాయిక‌గా న‌టించింది. దీనికి KP కుమారన్ రచన - దర్శకత్వం వహించారు. విమర్శకులు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనలను అందుకుంది. ఆ తర్వాత నిత్య వెనుదిరిగి చూసుకోలేదు. నూట్రన్‌బదు/180, తాల్సమయం ఒరు పెంకుట్టి, JK ఎనుమ్ నన్బనిన్ వాఙ్కై, కోటిగొబ్బ 2, ముదింజ ఇవాన పూడి, తిరుచిత్రంబళం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలలో పనిచేసింది.

నిత్య ఇటీవల TK రాజీవ్ కుమార్ రచన - దర్శకత్వం వహించిన మలయాళ డ్రామా చిత్రం కొలాంబిలో కనిపించింది. ఈ చిత్రంలో రెంజి పనికర్, రోహిణి, సిజోయ్ వర్గీస్, దిలీష్ పోత ముఖ్య పాత్రలు పోషించారు. నవంబర్ 20 నుండి 28 వరకు జరిగిన గోవాలోని 50వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కోలాంబి ప్ర‌ద‌ర్శిత‌మై `ఇండియన్ పనోరమ`కు ఎంపికైంది.

తెలుగుకు దూర‌మైంది ఎందుకు?

అయితే నిత్యామీన‌న్ కి తెలుగు లోగిళ్ల‌లో ఉన్న గుర్తింపు గౌర‌వం అన‌న్య‌సామాన్యం. నిత్యాను జూనియ‌ర్ సౌంద‌ర్య‌గా భావించి తెలుగు వారు ఆరాధిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో నిత్యాకు ఉన్న ఫాలోయింగ్ ఎంతో గొప్ప‌ది కూడా. అందుకే చాలా కాలంగా నిత్యా మీన‌న్ తెలుగులో బ్రేక్ తీసుకోవ‌డంపై గుర్రు మీద ఉన్నారు. భీమ్లా నాయ‌క్ త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి మ‌రో సినిమాలో న‌టించ‌లేదేమిటో! అంటూ అభిమానులు గుర్రుమీదున్నారు. ఓటీటీ సిరీస్ ల‌ను త‌గ్గించుకుని మెయిన్ స్ట్రీమ్ లో పెద్ద సినిమాల్లో న‌టిస్తూ క్రేజీ హీరోయిన్ గా వెలిగిపోవాల‌ని కూడా నిత్యా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.