పిక్ టాక్ : వైట్ అండ్ వైట్ డాషింగ్ లుక్‌లో ఎన్టీఆర్
ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ ఉన్నాడు. ఆ సినిమా కోసం కాస్త డిఫరెంట్ లుక్‌లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారనే విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 9 Dec 2024 4:41 AM GMTఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ ఉన్నాడు. ఆ సినిమా కోసం కాస్త డిఫరెంట్ లుక్‌లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారనే విషయం తెల్సిందే. ఇప్పటి వరకు వార్ 2 నుంచి అఫిషియల్ లుక్ బయటకు రాలేదు. కానీ ఆయన ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో తీసిన ఫోటోలతో ఆయన లుక్‌కి సంబంధించిన ఒక క్లారిటీ వస్తుంది. దేవర సినిమాలో కాస్త ఎక్కువ జుట్టుతో కనిపించిన ఎన్టీఆర్ వార్ 2 కోసం ఆర్మీ స్టైల్ హెయిర్ కట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అనిపిస్తోంది. తాజాగా ఆయన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక ప్రైవేట్ ఫంక్షన్‌కు హాజరు అయిన ఎన్టీఆర్ ఇలా చిన్న కొడుకుతో ముచ్చట్లాడుతూ, ముద్దులాడుతూ ఉండగా ఫొటో క్లిక్ అనిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఎన్టీఆర్ లుక్ బాగుంది. వైట్ అండ్ వైట్ డాషింగ్ సూట్‌లో భలే ఉన్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్మీ హెయిర్ స్టైల్‌తో చాలా ఫిట్‌గా ఎన్టీఆర్ ఉన్నారని, ఇలా ఏదైనా సినిమాలో చూస్తే బాగుండు అనుకుంటున్నారు. మేకోవర్ విషయం ఏమో కానీ, హెయిర్ స్టైల్ విషయంలో మాత్రం వార్ 2 సినిమాలో ఇలాగే కనిపిస్తాడని సమాచారం అందుతోంది.
ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. కనుక ఇప్పుడు ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసే విధంగా ఉంటుంది. ఇటీవల వచ్చిన దేవర సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రికార్డ్ స్థాయి వసూళ్లు సొంతం చేసుకున్న దేవర సినిమాకు పార్ట్ 2 ను వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి వార్ 2 తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తదుపరి సినిమా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఉంటుంది.
చాలా కాలం క్రితమే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి సంబంధించిన ప్రకటన వచ్చింది. కానీ ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్, దేవర సినిమాలతో బిజీగా ఉండగా, ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. వచ్చే ఏడాదిలో వీరి కాంబో మూవీ పట్టాలెక్కి 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా వీరి కాంబో మూవీ ఉంటుంది అనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. వార్ 2 సినిమా 2025 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వార్ 2 లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నాడని సమాచారం.