టైగర్ తో రౌడి.. బ్లాస్ట్ చేసేలా ఉన్నారు!
ఇప్పటికే విడుదలైన విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ఫిబ్రవరి 12న VD12 టైటిల్ టీజర్ రాబోతుందనే అప్డేట్ అభిమానులను మరింత ఉత్సాహంలో ముంచెత్తుతోంది.
By: Tupaki Desk | 11 Feb 2025 8:34 AM GMTటాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో VD12 ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. సినిమా కంటెంట్ ఎలా ఉండబోతోందో అన్న కుతూహలం ఉన్నా, మేకర్స్ ఇప్పటివరకు ఒక్క ఫస్ట్ లుక్ మినహా పెద్దగా అప్డేట్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మాత్రం VD12 అఫీషియల్ టీజర్ అనౌన్స్‌మెంట్‌తో సినిమా మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చింది.
ఇప్పటికే విడుదలైన విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ఫిబ్రవరి 12న VD12 టైటిల్ టీజర్ రాబోతుందనే అప్డేట్ అభిమానులను మరింత ఉత్సాహంలో ముంచెత్తుతోంది. ఈ టీజర్ ప్రత్యేకత ఏమిటంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పవర్‌ఫుల్ వాయిస్‌తో విజయ్ దేవరకొండను ఇంట్రడ్యూస్ చేయనున్నాడు. అంటే విజయ్ పాత్ర వెనుక ఉన్న కథను ఎన్టీఆర్ గొంతుతో చెప్పబోతున్నారన్నమాట.
సినిమా ప్రమోషన్స్‌లో ఇది మేజర్ హైలైట్ కానుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో టీజర్ విడుదల చేయడం, సినిమాకు అదనపు హైప్ తీసుకురానుంది. ఎన్టీఆర్ ప్రత్యేకంగా స్టూడియోలో తన వాయిస్ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది, దీనికి సంబంధించిన డబ్బింగ్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. ప్రత్యేకంగా తారక్ తో రౌడి నడుస్తున్న ఫొటో ఒకటి రిలీజ్ చేశారు. బ్యాక్ వ్యూ లో ఇద్దరు కూడా టీజర్ వర్క్ గురించి చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక వారిని చూస్తుంటే టీజర్ తోనే ఎదో బ్లాస్ట్ చేసేలా ఉన్నారని కామెంట్స్ వస్తున్నాయి. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే ఇది ఒక ప్రత్యేకమైన మూవీగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఇక మరోవైపు రణబీర్ కపూర్ హిందీ వెర్షన్‌కు, సూర్య తమిళ వెర్షన్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రానికి మ్యూజిక్ అనిరుధ్ అందిస్తున్నాడు. VD12 చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బొర్సే నటిస్తుండగా రుక్మిణి వసంత్ మరొక కీలక పాత్రలో కనిపించబోతోంది. సినిమాలో స్టార్ క్యాస్ట్ చాలా కొత్తగా ఉంటుందని టాక్. దర్శకుడు గౌతమ్ KGF లాంటి సినిమా తీస్తున్నట్లు ఇదివరకే నిర్మాత నాగవంశీ వివరణ ఇచ్చారు. ఇక ముందుగా ఎన్టీఆర్ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో టీజర్ ఎలా ఉండబోతోందో చూడాలి.