Begin typing your search above and press return to search.

వీడియో : స్కాట్లాండ్‌లో సామాన్యుడిగా ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ రోడ్డు మీద తిరుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సినీ ప్రముఖులు రోడ్ల మీద తిరుగుతున్నారు అంటే అది కచ్చితంగా విదేశాల్లో అయ్యి ఉంటుంది.

By:  Tupaki Desk   |   11 Jan 2025 8:33 AM GMT
వీడియో : స్కాట్లాండ్‌లో సామాన్యుడిగా ఎన్టీఆర్‌
X

సినిమా స్టార్స్ జనాల్లోకి వెళ్లాలి అనుకున్నా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా ద్వారా ఎంతో కొంత పాపులారిటీ వచ్చిన వారు రోడ్డు మీద కనిపిస్తే సెల్ఫీ అంటూ మీద పడి పోతున్నారు. ఇక సినిమా స్టార్స్ వస్తున్నారు అంటే వందల మంది జనాలు గుమ్మికూడుతూ ఉంటారు. అందుకే ఇండస్ట్రీకి చెందిన వారు సాధారణంగా బయటకు వెళ్లాలి అనుకోరు. ఒక వేళ వెళ్లినా మాస్క్ ధరించి బయటకు వెళ్తారు. ఎవరూ గుర్తు పట్టకుండా బయట తిరుగుతారు. కొందరు రాత్రి సమయంలో తిరగడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఎన్టీఆర్ తాజాగా వందలాది మంది జనాలు తిరుగుతున్న రోడ్డు మీద కనిపించి ఆశ్చర్యపరిచాడు.

ఎన్టీఆర్‌ రోడ్డు మీద తిరుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సినీ ప్రముఖులు రోడ్ల మీద తిరుగుతున్నారు అంటే అది కచ్చితంగా విదేశాల్లో అయ్యి ఉంటుంది. ఔను ఎన్టీఆర్‌ సైతం విదేశాల్లో రోడ్డు మీద తిరుగుతున్న సమయంలోనే ఈ వీడియో తీయడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే స్కాట్లాండ్‌కు చెందిన ఒక సోషల్‌ మీడియా ఇన్ఫ్యూలెన్సర్‌ తీసిన వీడియోలో ఎన్టీఆర్‌ కనిపించాడు. అతడు తెలియకుండా తీసిన ఆ వీడియోలో ఎన్టీఆర్‌ కనిపించడంతో చాలా మంది అతడికి మెసేజ్ చేశారట. ఆర్ఆర్‌ఆర్ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమాలో నటించిన స్టార్‌ అంటూ అతడు ఎన్టీఆర్‌ని గుర్తించాడు.

స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌ క్రిస్మస్ మార్కెట్‌ అందాలను చిత్రీకరిస్తున్న సమయంలో సామాన్యులతో కలిసి సామాన్యుడిగా ఎన్టీఆర్‌ నడుస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఎన్టీఆర్‌ అంత మంది జనాల్లో సింపుల్‌గా అలా నడుచుకుంటూ రావడం మనం సినిమాల్లో మాత్రమే చూస్తాం. కానీ సాధారణ జనాల్లో అలా ఎన్టీఆర్‌ నడుచుకుంటూ వస్తున్న వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్టీఆర్‌ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్‌ఆర్‌, అరవింద సమేత, దేవర సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌ పాన్ ఇండియా రేంజ్‌ను దాటి గుర్తింపు దక్కించుకున్నాడు.

ప్రస్తుతం వార్‌ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ నెల చివరి వారం నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాను కర్ణాటకలో మొదలు పెట్టబోతున్నారు. డ్రాగన్ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యాయని, త్వరలో షూటింగ్‌ ప్రారంభించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. 2026 జనవరిలోనే సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. జనవరిలో మిస్‌ అయితే 2026 సమ్మర్ వరకు ఎన్టీఆర్‌ - నీల్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.