Begin typing your search above and press return to search.

దేవర 2 గురించి తారక రాముడు ఏమన్నాడు..?

ఈ సక్సెస్ పార్టీ లో ఎన్టీఆర్ ఈ సినిమా సక్సెస్ చేసినందుకు తన ఫ్యాన్స్ కు స్పెషల్ థాంక్స్ చెప్పినట్టు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   4 Oct 2024 6:00 AM GMT
దేవర 2 గురించి తారక రాముడు ఏమన్నాడు..?
X

ఎన్టీఆర్ నటించిన దేవర మొదటి భాగం లాస్ట్ ఫ్రై డే రిలీజై సక్సెస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఆచార్య తర్వాత దేవర సినిమా చేసిన కొరటాల శివ ఫ్యాన్స్ మెప్పించే మాస్ అంశాలతో పాటు దానికి తగిన కథ కథనాలతో వచ్చాడు. దేవర 1 ఫ్యాన్స్ ని సంతృప్తి పరచినా కూడా కామన్ ఆడియన్స్ ఏదో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాలతో వచ్చి సక్సెస్ అందుకున్న దేవర సక్సెస్ పార్టీ హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో జరిగింది. ఎన్ టీ ఆర్ తో పాటు ఆ సినిమా యూనిట్ ఇంకా సినిమా పరిశ్రమకు సంబందించిన వారు.. దేవర డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు కొంతమంది దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు.

ఈ సక్సెస్ పార్టీ లో ఎన్టీఆర్ ఈ సినిమా సక్సెస్ చేసినందుకు తన ఫ్యాన్స్ కు స్పెషల్ థాంక్స్ చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాదు దేవర 2 కోసం తాను ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నానని.. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని ఆతృతగా ఉందని అన్నారట. దేవర 2 సినిమా ఇంకాస్టర్ భారీగా ఉంటుందని చెప్పారని తెలుస్తుంది. ఐతే ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా చేస్తున్నాడు. హృతిక్ రోషన్ తో తారక్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.

ఈ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా ఉంది. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఐతే దేవర 2 నెక్స్ ఇయర్ సెకండ్ హాఫ్ లో షూటింగ్ మొదలు పెట్టి 2026 లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దేవర 1 ఎలాగు చూశారు కాబట్టి ఫ్యాన్స్ అంతా దేవర 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఈలోగా కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి దేవర 2 ని మరింత ఫోకస్ తో తెరకెక్కించాలని చూస్తున్నాడు.

దేవర 1 ఫీడ్ బ్యాక్ నుంచి పార్ట్ 2 లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కొరటాల శివ ఫోకస్ పెట్టాడు. దేవర 2 లో అనిరుద్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. దేవర 2 లో తారక్ మరోసారి అదరగొట్టబోతున్నాడని తెలుస్తుంది.