Begin typing your search above and press return to search.

ధైర్యం ఇచ్చే వాడు హీరో.. దేవర భయాన్నిస్తాడు..!

ఏ సినిమాలో అయినా హీరో ప్రజలకు ధైర్యాన్ని ఇస్తాడు. కానీ దేవర సినిమాలో భయాన్ని పరిచయం చేస్తాడు. అది బాగా ఆసక్తికరంగా అనిపించిందని అన్నారు ఎన్టీఆర్.

By:  Tupaki Desk   |   20 Sep 2024 10:31 AM GMT
ధైర్యం ఇచ్చే వాడు హీరో.. దేవర భయాన్నిస్తాడు..!
X

ఎన్టీఆర్, జాన్వి జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దేవర. వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉన్నాడు ఎన్ టీ ఆర్. ఈ క్రమంలో ఎన్ టీ ఆర్, కొరటాల శివతో యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ కలిసి ఇంటర్వ్యూ చేశారు. దేవరకు సంబంధించిన విషయాలను ఇంట్రెస్టింగ్ డీటైల్స్ ను ప్రేక్షకులకు తెలియచేసే ప్రయత్నం చేశారు. ఫన్ అండ్ ఫియర్ అంటూ ఎంటర్టైనింగ్ గా ఈ చిట్ చాట్ సాగింది. ముందుగా దేవర కథ ఎందుకు నచ్చిందన్న ప్రశ్నకు తారక్ ఆన్సర్ ఇచ్చాడు.

ఏ సినిమాలో అయినా హీరో ప్రజలకు ధైర్యాన్ని ఇస్తాడు. కానీ దేవర సినిమాలో భయాన్ని పరిచయం చేస్తాడు. అది బాగా ఆసక్తికరంగా అనిపించిందని అన్నారు ఎన్టీఆర్. ధైర్యం మితిమీరిన వారికి భయంతో ఎలా ఉండాలో చెప్పే కథ ఇది. అందుకే కథ నచ్చిందని అన్నారు. అంతేకాదు సినిమాలో యాక్షన్ పార్ట్ చాలా బాగుంటుందని. అందుకే సినిమా రిజల్ట్ మీద చాలా నమ్మకంగా ఉన్నామని అన్నారు ఎన్టీఆర్. దేవర కథ చాలా పెద్దది 8,9 గంటల సినిమా అవుతుంది. అందుకే రెండు భాగాలుగా తీశామని అన్నారు ఎన్టీఆర్.

దేవర రొమాన్స్ గురించి ఎన్టీఆర్ ప్రస్తావిస్తూ.. అన్ని సినిమాల్లో లానే ఈ సినిమాలో కూడా ఉంటుంది. ఇంటిమేట్ సీన్స్ కు ఛాన్స్ లేదు. కానీ హీరో హీరోయిన్ మధ్య కొత్త రకంగా రొమాన్స్ కొరటాల శివ రాశాడని అన్నారు. కచ్చితంగా సిద్దు స్థాయి రొమాన్స్ అయితే ఉండదని సరదాగా అన్నారు. సినిమాకు అనిరుద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కచ్చితంగా అతను ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తాడని అన్నారు ఎన్ టీ ఆర్.

జాన్వి గురించి ఆసక్తికరంగా చెప్పిన ఎన్టీఆర్.. రెండు పేజీల డైలాగ్ ని కూడా చాలా తేలికగా చెప్పేసిందని అన్నారు. మంచి టాలెంటెడ్.. ఈ సినిమా కోసం చాలా కష్టపడిందని ఎన్టీఆర్ అన్నారు. ఓ పక్క ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ డైలాగ్ చెప్పడం చాలా కష్టం. అది జాన్వి చేయడం చూసి షాక్ అయ్యానని డైరెక్టర్ కొరటాల శివ అన్నారు.

సినిమాలో ఆయుధ పూజ గురించి ఎన్టీఆర్ వివరిస్తూ.. సినిమాలో కులం, మతం అనేది ఉండదు. అందరు ఆయుధాలను పూజిస్తారు. వాళ్లకి అవి ఎందుకు అంత ప్రత్యేకమన్నది సినిమాలో తెలుస్తుంది. ఈ సినిమా కోసం గోవాలో మండుటెండలో షూట్ చేశాం షాట్ గ్యాప్ లో రూం కి వెళ్తే ఏసీ పనిచేయలేదు ఆ టైం లో చాలా చిరాకు అనిపించిందని ఎన్ టీ ఆర్ చెప్పారు.

ఇలా దేవరకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను చెబుతూ మధ్య మధ్యలో సిద్ధు జొన్నలగడ్డని ఆటపట్టిస్తూ ఇంటర్వ్యూ అంతా జోష్ ఫుల్ గా చేశారు.