Begin typing your search above and press return to search.

వార్ 2 అసలు ఘట్టానికి సిద్ధమైన తారక్

ఈ నెలలోనే ‘వార్ 2’ మూవీ కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలు షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   9 Oct 2024 7:39 AM GMT
వార్ 2 అసలు ఘట్టానికి సిద్ధమైన తారక్
X

‘దేవర’ మూవీ కమర్షియల్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా హ్యాపీగా ఉన్నారు. సినిమాకి మిశ్రమ స్పందనలు వచ్చిన కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. డీసెంట్ కలెక్షన్స్ తో మూవీ థియేటర్స్ లో కొనసాగుతోంది. దసరా ఫెస్టివల్ వరకు ‘దేవర’ మూవీ సందడి ఉంటుందని మేకర్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమాకి 600 వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే ‘దేవర’ మూవీ టెన్షన్ తగ్గిపోవడంతో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల షూటింగ్ పై ఫోకస్ చేయబోతున్నాడు. మొదట హిందీ డెబ్యూ మూవీ ‘వార్ 2’ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. ఈ నెలలోనే ‘వార్ 2’ మూవీ కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలు షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దానికి సంబందించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో స్పై థ్రిల్లర్ సిరీస్ లో భాగంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.

‘వార్’ మూవీ సీక్వెల్ గా ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయంట. ఎన్టీఆర్ క్యారెక్టర్ కాస్తా గ్రే షేడ్స్ లో ఉంటుందనే మాట వినిపిస్తోంది. త్వరలో ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశాలని షూట్ చేయబోతున్నారంట. ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ మీద ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ ‘వార్ 2’ తో ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కి నార్త్ ఇండియన్ ఆడియన్స్ భాగా కనెక్ట్ అయ్యారు. ‘దేవర’ మూవీకి కూడా బాలీవుడ్ లో మంచి ఆదరణ లభిస్తోందనే మాట వినిపిస్తోంది. అయితే ‘వార్ 2’ తో హిందీ బెల్ట్ లో స్ట్రాంగ్ మార్కెట్ ని ఎన్టీఆర్ క్రియేట్ చేసుకోవడం గ్యారెంటీ అని అంటున్నారు. ఈ చిత్రం తర్వాత బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఎన్టీఆర్ తో స్ట్రైట్ హిందీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ‘వార్ 2’ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే, వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ పైన తారక్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. అది సెట్స్ పైన ఉండగానే ‘దేవర 2’ కూడా స్టార్ట్ చేయొచ్చని టాక్.