Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో కన్నడ బ్యూటీ జాక్ పాట్

ఇప్పుడు వీరి దారిలో మరో కన్నడ అందం రుక్మిణీ వసంత్ తెలుగులోకి అడుగుపెడుతోందనే టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   1 Oct 2024 5:09 AM GMT
ఎన్టీఆర్ తో కన్నడ బ్యూటీ జాక్ పాట్
X

కన్నడ భామలకి తెలుగులో ఎక్కువగా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అలాగే చాలా మంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా కర్ణాటక నుంచి వచ్చినవారే కావడం విశేషం. అనుష్క, పూజా హెగ్డే, రష్మిక లాంటి బ్యూటీస్ కన్నడ ప్రాంతం నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇక్కడ స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కాంతారా’ ఫేమ్ సప్తమి గౌడ, ‘కేజీఎఫ్’ సిరీస్ తో సక్సెస్ అందుకున్న శ్రీనిధి శెట్టి ఇప్పటికే టాలీవుడ్ లోకి తెరంగేట్రం చేశారు.

ఇప్పుడు వీరి దారిలో మరో కన్నడ అందం రుక్మిణీ వసంత్ తెలుగులోకి అడుగుపెడుతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ బ్యూటీ తెలుగులో మొదటి చిత్రంతోనే ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో జతకట్టబోతోందనే ప్రచారం నడుస్తోంది. ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు. భారీ బడ్జెట్ తో మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది.

ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. అలాగే క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నాడంట. ‘డ్రాగన్’ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం ప్రశాంత్ నీల్ రుక్మిణీ వసంత్ ని ఫైనల్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. కన్నడంలో రక్షిత్ శెట్టికి జోడీగా ‘సప్తసాగరాలు ధాటి’ అనే సినిమాతో రుక్మిణీ అందరికి చేరువ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

వాటిలో కన్నడ మూవీస్ రెండు కాగా తమిళంలో విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ సినిమాలలో రుక్మిణీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమాలే కావడం విశేషం. ఈ సినిమాలు లైన్ అప్ లో ఉండగానే ఏకంగా ఎన్టీఆర్ తో జోడీగా కన్ఫర్మ్ అయ్యిందనే వార్త తెరపైకి వచ్చింది. త్వరలో ఈ బ్యూటీ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉందంట.

ఒకవేళ రుక్మిణీ ‘డ్రాగన్’ మూవీలో నటించడం ఖాయం అయితే మాత్రం ఆమెకిది టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ అవుతుంది. అలాగే పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా మరిన్ని అవకాశాలు అందుకోవచ్చు. ఇక ‘డ్రాగన్’ మూవీ 2026 సంక్రాంతికి రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. ఈ ఏడాదిలోనే మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.