`దేవర` నాలుగు గ్రామాల మధ్య భీకర పోరాటం!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన `దేవర` మొదటి భాగం భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Sep 2024 12:30 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన `దేవర` మొదటి భాగం భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ఆద్యంతం అంచనాలు పెంచేసాయి. అయితే ఈ సినిమా స్టోరీ ఏంటి? అన్నది ఇంత వరకూ ఎక్కడా లైన్ కూడా లీక్ అవ్వలేదు. తారక్ చెప్పిన డైలాగులతో స్టోరీని కొంత వరకూ గెస్ చేస్తున్నారు.
`మనిషికి బతికేంత ధైర్యం చాలని, చంపేంత ధైర్యం అవసరం లేదంటాడు. కాదూ కూడదని ఎవరైనా చంపేంత ధైర్యాన్ని కూడకడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతానంటాడు తారక్. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సముద్రంలోకి ఎక్కితే? ఆ రోజు నుంచి కానరాని భయాన్ని అవుతానని హెచ్చరిస్తాడు. మరి ఆ హెచ్చరిక దేనికి? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. రిలీజ్ నేపథ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ `దేవర` టీమ్ ని స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.
తారక్ మాట్లాడుతూ... `నాలుగు గ్రామాలు, గ్రామ దేవతలు. పూర్వీకుల ఆయుధాల కోసం చేసే పోరాటం ఇది. నాలుగు గ్రామాల్లో ఏ గ్రామానికి పేరు ఉండదని, ఆ నాలుగు గ్రామాలు సముద్ర తీరంలోని ఓ కొండ ప్రాంతంలో ఉంటాయ న్నారు. నాలుగు గ్రామాల్లో ఓ గ్రామానికి బైరా సైఫ్ అలీఖాన్ నాయకుడు కాగా, మరో గ్రామానికి `దేవర` ఎన్టీఆర్ నాయకుడు. ఇది పూర్తిగా ఫిక్షనల్ ప్రపంచంలో జరిగే కథ. సముద్ర తీరంలోని ఓ నాలుగు గ్రామాల మధ్య సినిమా ఉంటుందన్నారు.
ఓ కొత్త ప్రపంచం కనబడుతుంది. 1980, 90లలో కథ సాగుతుంది. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పాటించే పురాతన ఆచారాలను సినిమాలో చూపించామన్నారు` అయితే రిలీజ్ కి ముందు స్టోరీ రివీల్ చేయడం ఇంట్రెస్టింగ్. సాధారణంగా స్టోరీలు రివీల్ చేయరు. కానీ కొన్ని సినిమాలకు స్టోరీలు రివీల్ చేస్తేనే ప్రేక్షకులకు అర్దమవుతోన్న వైనం కనిపిస్తుంది. సలార్ సీజ్ పైర్ విషయంలో ఇలాంటి కన్ప్యూజన్ తెరపైకి వచ్చింది. ప్రభాస్ యాక్షన్ వరకూ ఒకే చెప్పినా స్టోరీ ఏంటో? అర్దం కాలేదనే విమర్శలు వ్యకమయ్యాయి. దేవర విషయంలో అలాంటి గందరగోళం లేకుండా ముందే హింట్ ఇచ్చేసారు.