Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ కోసం తార‌క్-స‌మంత వెళ్తారా?

'ఆర్ ఆర్ ఆర్' విజ‌యంతో బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ తెలుగు ఆడియ‌న్స్ కి ఎంతో ద‌గ్గరైంది.

By:  Tupaki Desk   |   7 Oct 2024 8:30 PM GMT
ఆ హీరోయిన్ కోసం తార‌క్-స‌మంత వెళ్తారా?
X

'ఆర్ ఆర్ ఆర్' విజ‌యంతో బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ తెలుగు ఆడియ‌న్స్ కి ఎంతో ద‌గ్గరైంది. సీత‌మ్మ పాత్ర‌తో తెలుగు అభిమానుల్ని సంపాదించుకుంది. అటుపై 'బ్ర‌హ్మాస్త్ర‌'తో మ‌రింత గా చేరింది. ఆ సినిమా ప్ర‌మోష‌న్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చి తెలుగు న‌టులు, యాంక‌ర్ల‌తో అలియా ఇంట‌రాక్ట్ అయిన విధానం ప్రేక్ష‌కాభిమానుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అన్నింటిని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి ఎంతో క్లొజ్ ప్రెండ్ గామారిపోయింది.

'ఆర్ ఆర్ ఆర్' తో మొద‌లైన ఆ జ‌ర్నీ ఎంతో హ్యాపీగా సాగుతుంది. అలియాభట్-ర‌ణ‌బీర్ క‌పూర్ హైద‌రాబాద్ కి ఎప్పుడొచ్చినా? నేరుగా తార‌క్ ఇంట్లోనే దిగుతారు. అంతటి క్లోజ్ బాండింగ్ తార‌క్ ఫ్యామిలీతో ఉంది. 'బ్ర‌హ్మాస్త్ర' ప్ర‌మోష‌న్ కి తార‌క్ కూడా హాజ‌రైన‌ సంగ‌తి తెలిసిందే. తాజాగా తార‌క్ మ‌రోసారి అలియాభ‌ట్ కోసం బ‌య‌టకు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. అత‌డితో పాటు స‌మంత కూడా ఒకే వేదిక‌ను పంచుకునే అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుతం అలియాభట్ ప్ర‌ధాన పాత్ర‌లో `జిగ్రా` చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియాలో ఈసినిమా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. హైద‌రాబాద్ లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారుట‌. ఈ నేప‌థ్యంలో ముఖ్య అతిధులుగా యంగ్ టైగ‌ర ఎన్టీఆర్...స‌మంత‌ల‌ను ఆహ్వానించాల‌ని అలియాభ‌ట్ భావిస్తోందిట‌. అలియాభ‌ట్ పిలిస్తే తార‌క్ కాదంటాడా? నో చెప్ప‌కుండా వ‌చ్చేస్తాడు.

ప్ర‌స్తుతం తార‌క్ కూడా రిలాక్స్ గానే ఉన్నాడు. `దేవ‌ర` రిలీజ్ అనంత‌రం ఫ్యామిలీతోనే గ‌డుపుతున్నాడు. ద‌స‌రా అనంత‌రం వెకేష‌న్ కి వెళ్లే అవ‌కాశం ఉంది. జిగ్రా ఈవెంట్ ఈ మ‌ధ్య‌లో జ‌రిగే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ఈవెంట్ ఉంటే గ‌నుక తార‌క్ త‌ప్ప‌క హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. అలాగే స‌మంత కూడా హాజ‌రు కానుంద‌ని తెలుస్తోంది.