ఎన్టీఆర్ మరో క్రేజీ యాడ్.. వరుస కమర్షియల్ బ్రాండ్ డీల్‌లు!
ఇక తాజా బ్రాండ్ డీల్ విషయానికి వస్తే, Zepto యాడ్‌లో ఎన్టీఆర్ కనిపించడం అభిమానులను తెగ ఉత్సాహపరుస్తోంది.
By: Tupaki Desk | 7 March 2025 5:09 PM ISTఎన్టీఆర్ కెరీర్ ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ హై రేంజ్ లో కొనసాగుతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో తన క్రేజ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ, స్టార్ హీరోగా తన బ్రాండ్‌ను మరింత స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో, ఫిల్మ్ ప్రాజెక్టులతో పాటు కమర్షియల్ యాడ్స్‌లోనూ వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన మూడు హై ప్రొఫైల్ సినిమాలు ఉండగా, తాజా మరో బ్రాండ్ డీల్ మాత్రం మరో లెవెల్‌లో ఉంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం మూడు క్రేజీ సినిమాల లైనప్‌తో ముందుకు సాగుతున్నారు. మొదటిగా, యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై వార్ 2 చేస్తున్నాడు, ఇందులో హృతిక్ రోషన్‌తో కలిసి నటించబోతున్నారు. అలాగే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన మరో మాస్ యాక్షన్ సినిమా చేయనున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ లాంటి హిట్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌తో ఎలా మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ తీసుకొస్తాడో అనే ఆసక్తి పెరిగింది. ఇక మరో ప్రాజెక్ట్ దేవర 2 గురించే ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతోంది.
ఇప్పటివరకు దేవర సీక్వెల్‌పై అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, దేవర 2 సెట్స్ పైకి వెళ్లడం ఖాయమే. మొదటి పార్ట్ మిశ్రమ స్పందన అందుకున్నా, సినిమాకు ఉన్న హైప్ కారణంగా రెండో భాగానికి డిమాండ్ తగ్గలేదు. కానీ, దర్శకుడు కొరటాల శివ మాత్రం ఈసారి స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ కూడా ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక తాజా బ్రాండ్ డీల్ విషయానికి వస్తే, Zepto యాడ్‌లో ఎన్టీఆర్ కనిపించడం అభిమానులను తెగ ఉత్సాహపరుస్తోంది. "ఒకసారి చూసేయండి.. అన్ని తక్కువ ధరలకే" అంటూ తన స్టైల్‌లో ఎన్టీఆర్ అదిరిపోయే ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఆయన యాపి ఫీజ్, నవరత్న ఆయిల్ వంటి బ్రాండ్‌లకు ప్రచారకర్తగా వ్యవహరించగా, ఇప్పుడు Zepto తో ఆయన యాడ్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
ఎన్టీఆర్ ప్రస్తుతం కమర్షియల్ వైజ్ డిమాండ్ ఉన్న స్టార్. ఒకవైపు వరుస కమర్షియల్ బ్రాండ్ డీల్స్ చేస్తూనే, సినిమాల్లో కూడా భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ముఖ్యంగా వార్ 2 తో బాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేయడం, ప్రశాంత్ నీల్ సినిమాతో మాస్ అండ్ యాక్షన్ లెవెల్‌ను పెంచడం.. ఇలా అన్ని కోణాల్లో ప్లాన్ చేయడం గమనార్హం. అలాగే Zepto వంటి బ్రాండ్స్ ద్వారా దేశవ్యాప్తంగా జనంలోకి మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.