యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ వెనక YRF బిగ్ ప్లాన్!
హృతిక్ రోషన్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా యశ్ రాజ్ ఫిలింస్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `వార్ -2` నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తోన్న చిత్రమిది.
By: Tupaki Desk | 23 July 2023 2:11 PM GMTహృతిక్ రోషన్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా యశ్ రాజ్ ఫిలింస్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `వార్ -2` నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తోన్న చిత్రమిది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ తో టైగర్ అభిమానుల్లో కాక మొదలైంది. యంగ్ టైగర్ బాలీవుడ్ డెబ్యూ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ కాంబినేషన్ లో సినిమా అనేది ఊహకు కూడా రాలేదు.
ప్రేక్షకాభిమానులకు ఇది ఊహించని సర్ ప్రైజ్. హృతిక్ -తారక్ కాంబినేషన్ ఏంటి? అని ఇప్పటికీ ఓ సందేహం వెంటాడుతూనే ఉంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే యుద్ద భూమిలో తారక్ కోసం ఎదురుచూస్తున్నట్లు హృతిక్ రివీల్ చేసాడు. ఓవైపు వైఎర్ఎఫ్ భారీ సినిమాలు ఖాన్ హీరోలతో నిర్మిస్తూనే ఈ కాంబినేషన్ ని తెరపైకి తెచ్చింది.
YRF స్పైవర్స్ లో సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. హృతిక్ రోషపన్ ..టైగర్ ష్రాఫ్‌తో సహా కొందరు బాలీవుడ్ స్టార్స్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడీ జాబితాలోకి యంగ్ టైగర్ కూడా చేరుతున్నాడు. ఈ సినిమా కోసం తారక్ భారీగానే పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే వైఆర్ ఎఫ్ గేమ్ ప్లాన్ కూడా బయట పడుతుంది. ఈ చిత్రాన్ని హిందీతో పాటు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతోంది.
అందులో భాగంగా తెలుగులోనూ తారక్ క్రేజ్ నడుమ ప్రేక్షకుల ముందుకొస్తుంది. హిట్ అయితే తెలుగు నుంచి భారీగా వసూళ్లు వస్తాయి. తద్వారా వైఆర్ ఎఫ్ టాలీవుడ్ లో అధికారికంగానూ లాంచ్ అయినట్లు అవుతుంది. ప్రస్తుతం పాన్ వరల్డ్ లో తెలుగు సినిమా క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునేందుకు తారక్ని వైఆర్ ఎఫ్ ఓ పావులా వినియోగించు కుంటుందని తెరపైకి వస్తోంది. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న సంస్థ ఇప్పుడే పనిగట్టుకుని ఓ తెలుగు హీరోని తెరపైకి తెచ్చిందంటే? గేమ్ ప్లాన్ అర్దం కాలేదా? అంటూ గుసగుస మొదలైంది.
`వార్ -2` తర్వాత అదే సంస్థ యంగ్ టైగర్ హీరోగా సోలోగా మరో భారీ ప్రాజెక్ట్ ని పాన్ ఇండియాలో ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు లీకులందుతున్నాయి. అటుపై టాలీవుడ్ అగ్ర హీరోలందర్నీ చుట్టేసి తమ సంస్థలో భారీ పారితోషికం ఆఫర్ చేసి సినిమాలు చేసేలా ఒప్పందం చేసుకునే ప్లాన్ లో భాగమని మీడియా కథనాలు చర్చనీయాంశగా మారాయి.