Begin typing your search above and press return to search.

మెగా దీవాళి పార్టీలో మ‌హేష్‌-ఎన్టీఆర్

ఇటీవ‌ల బాలీవుడ్ లో వ‌రుసగా సెల‌బ్రిటీ పార్టీలు హోరెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Nov 2023 7:01 AM GMT
మెగా దీవాళి పార్టీలో మ‌హేష్‌-ఎన్టీఆర్
X

ఇటీవ‌ల బాలీవుడ్ లో వ‌రుసగా సెల‌బ్రిటీ పార్టీలు హోరెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. వినాయ‌క చ‌వితి, దేవీ న‌వ‌రాత్రులు, ఇప్పుడు దీపావ‌ళి స్పెష‌ల్ వేడుక‌లు అంటూ హంగామా మామూలుగా లేదు. ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు దిగ్గ‌జాలు పార్టీలు ఇస్తుంటే, వీటి కోసం రంగుల ప్ర‌పంచం మొత్తం వాలిపోతోంది. పండుగ‌లు ప‌బ్బాల‌కు ఇలా సంద‌డి చేయ‌డం అక్క‌డ చాలా కామన్.

ఇక బాలీవుడ్ త‌ర‌హాలోనే టాలీవుడ్ లోను ఇటీవ‌ల‌ పార్టీలు జ‌రుగుతున్నాయి. అయితే ఇక్క‌డ ఎక్కువ హంగామా ఉండ‌దు. చాలా ట్రెడిష‌న‌ల్ గా ఈవెంట్ల‌ను నిర్వ‌హిస్తుంటారు. ముఖ్యంగా మెగా స్టార్ చిరంజీవి ప్ర‌తి పండుగ‌ను ఎంతో సంబ‌రంగా సెల‌బ్రేట్ చేస్తుంటారు. ఈ వేడుక‌ల్లో మెగా కుటుంబ‌మంతా సంద‌డి చేస్తుంది. అలాగే ప‌రిశ్రమ ప్ర‌ముఖులు ఆహ్వానితులుగా వ‌స్తున్నారు. ఇప్పుడు దీపావ‌ళి వేడుక‌ల‌ను మెగాస్టార్ చిరంజీవి ఘ‌నంగా ప్లాన్ చేయ‌గా టాప్ స్టార్లు అటెండ‌య్యారు.

శ‌నివారం రాత్రి మెగాస్టార్ హోస్ట్ చేసిన ఈ వేడుక‌ల‌కు సూప‌ర్ స్టార్ మ‌హేష్- న‌మ్ర‌త దంప‌తులు స‌హా ఎన్టీఆర్ కూడా హాజ‌ర‌య్యారు. అలాగే కొత్త జంట‌ వ‌రుణ్ తేజ్ - లావ‌ణ్య త్రిపాఠి ఈ వేడుక‌ల్లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపించారు. రామ్ చ‌ర‌ణ్- ఉపాస‌న జంట ఈ పార్టీ హోస్టింగ్ బాధ్య‌త‌ను తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసార‌ని తెలిసింది.

మెగా పార్టీలో సంద‌డి చేసిన మ‌హేష్ గురించి, ఎన్టీఆర్ గురించి అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. `గుంటూరు కారం` కోసం స్టైలిష్ లుక్ లోకి మారిన మ‌హేష్‌, దేవ‌ర కోసం ర‌గ్గ్ డ్ లుక్ లోకి మారిన ఎన్టీఆర్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. మ‌హేష్‌.. ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్లో స‌త్తా చాటేందుకు దూసుకొస్తున్నారు. త్వ‌ర‌లో ఈ రెండు సినిమాలు విడుద‌ల కావాల్సి ఉంది.