Begin typing your search above and press return to search.

వార్ కోసం తార‌క్ కూడా రాటు దేలాల్సిందే!

బాలీవుడ్ లో `వార్ -2`కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని ఆయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కించ‌న్నారు.

By:  Tupaki Desk   |   20 Aug 2023 7:29 AM GMT
వార్ కోసం తార‌క్ కూడా రాటు దేలాల్సిందే!
X

బాలీవుడ్ లో `వార్ -2`కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని ఆయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కించ‌న్నారు. వైఆర్ ఎఫ్ స్పై యూనివ‌ర్స్ లో భారీ బ‌డ్జెట్ తో రూపొందుతుంది. యుద్ద‌భూమి లో హృతిక్ రోష‌న్- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన గ్లింప్స్ అభిమానుల్లో పూన‌కాలు తెప్పిస్తుంది. ఇక ఈ సినిమా కోసం హృతిక్ శ‌రీరాన్ని మ‌రింత శ‌క్తివంతంగా త‌యారు చేస్తున్నాడు. జిమ్ములో అద‌నంగా క‌ష్ట‌ప‌డుతున్నాడు.

రెగ్యుల‌ర్ టైమింగ్ క‌న్నా! అద‌నంగా రెండు గంట‌లు జిమ్ములో కేటాయిస్తున్నాడు. ఫైట‌ర్ కూడా యాక్ష‌న్ సినిమా కావ‌డంతో ఫిట్ నెస్ విష‌యంలో టైమింగ్ ఏమాత్రం మిస్ అవ్వ‌లేదు. సినిమాలో హృతిక్ చొక్కా విప్పి న‌టించాల్సిన యాక్ష‌న్ స‌న్నివేశాలు ఎన్నో ఉంటాయి. దీంతో లుక్ ప‌రంగా మ‌రిన్ని జాగ్రత్త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. పైగా తెలుగులోనూ ఈ సినిమా ప్ర‌తిష్టాత్మ‌కంగా రిలీజ్ అవుతుంది కాబ‌ట్టి మ‌రింత ఏకాగ్ర‌త‌తో ప‌నిచేయాల్సి ఉంది. అందుకే హృతిక్ `వార్ -2` కోసం ఇప్ప‌టి నుంచే ట్రైనింగ్ మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

ఇక సినిమాలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రో హీరోగా న‌టిస్తున్నాడా? ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడా? అన్న‌ది క్లారిటీ లేదు. పాత్ర ఏదైనా హృతిక్ కి ధీటుగా మాత్రం త‌యార‌వ్వాల్సిందే. అందులో ద‌ర్శ‌కుడు మాత్రం రాజీ ప‌డే ప్ర‌శ‌క్తే లేదు. పాత్రకి త‌గ్గ‌ట్టు ఫిట్ నెస్ బాడీతో వార్ -2లో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకు తార‌క్ బాడీని మ‌రింత శ‌క్తివంతంగా మార్చాల్సి ఉంటుంది. లుక్ టెస్ట్ లు కూడా ఉంటాయి కాబ‌ట్టి అన్ని ర‌కాలు సంతృప్తి ప‌రిచేలా సిద్ద‌మ‌వ్వాలి.

తార‌క్ ఇప్ప‌టికే టెంప‌ర్ లో సిక్స్ ప్యాక్ లుక్ లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. అందులో ఓ పాట‌లో చొక్కా విప్పి న‌టించాడు. ఆ సినిమా కోసం జిమ్ములో చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ప్ర‌త్యేక‌మైన ట్రైనింగ్ తీసుకుని ఆ లుక్ తీసుకొచ్చాడు. ఆ త‌ర్వాత ఆర్ ఆర్ ఆర్ లో కొమ‌రం భీమ్ పాత్ర కోసం వ‌ర్కౌట్లు చేయాల్సి వ‌చ్చింది. అయితే ఆ పాత్ర మ‌రి అంత డిమాండ్ చేయ‌లేదు కాబ‌ట్టి స‌రిపోయింది. కానీ ఇప్పుడు వార్ కోసం మ‌ళ్లీ భారీ క‌స‌ర‌త్తులు త‌ప్ప‌వ‌ని తెలుస్తుంది. హృతిక్ హైట్ ని ఎలాగూ మ్యాచ్ చేయ‌లేడు. కానీ లుక్ ప‌రంగా బాడీలో చాలా మార్పులు తీసుకురావాలి. యాక్ష‌న్ చిత్రం రోల్ కి నూరు శాతం న్యాయం చేసేలా తార‌క్ స‌న్న‌ద్దం అవ్వాల్సి ఉంటుంది.