Begin typing your search above and press return to search.

మహేష్ కి ఎన్టీఆర్‌ విషెష్‌.. ఫ్యాన్స్‌ ఫిదా

మహేష్ బాబుకు ఎన్టీఆర్‌ తెలిపిన బర్త్‌ డే విషెష్ కి ఇరువైపుల ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

By:  Tupaki Desk   |   9 Aug 2024 9:33 AM GMT
మహేష్ కి ఎన్టీఆర్‌ విషెష్‌.. ఫ్యాన్స్‌ ఫిదా
X

టాలీవుడ్‌ కి చెందిన హీరోల్లో ఒకప్పుడు ఐక్యత ఉండేది కాదు, ఒక హీరో అంటే మరొక హీరోకి కోపం, ఒకరిపై ఒకరు డామినేషన్ అన్నట్లుగా ఉండేవారు. కానీ ఈతరం స్టార్‌ హీరోల్లో అలాంటి పరిస్థితి లేదు. స్టార్‌ హీరోలు అయిన మహేష్ బాబు, చరణ్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్ ఇలా అందరు యంగ్‌ స్టార్‌ హీరోలు కూడా ఒకరు అంటే ఒకరు అభిమానం చూపించుకుంటూ, ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేక సందర్భాల్లో సోషల్‌ మీడియాలో విషెష్‌ చెప్పడంతో పాటు, ఒకరి సినిమా ప్రమోషన్ లో ఒకరు అన్నట్టు సహాయ సహకారాలు అందించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.

నేడు సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆయన ఫ్యాన్స్ లక్షలాది మంది హ్యాపీ బర్త్‌ డే మహేష్ అంటూ పోస్ట్‌ పెడుతున్నారు. ఎంత మంది ఫ్యాన్స్ పెట్టినా కూడా స్టార్‌ హీరోలు మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం చాలా ప్రత్యేకమైన విషయం గా చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నట్లుగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సోషల్‌ మీడియా ద్వారా మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. అన్నా అంటూ సంభోదిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం మాత్రమే కాకుండా ఈ ఏడాది అంతా మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అన్నాడు.

మహేష్ బాబుకు ఎన్టీఆర్‌ తెలిపిన బర్త్‌ డే విషెష్ కి ఇరువైపుల ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇద్దరు కూడా ఇండస్ట్రీ లో అతి పెద్ద హీరోలు. సాధారణంగా ఇలాంటి హీరోల మధ్య పోటీ విపరీతంగా ఉండి, ఒకరంటే ఒకరికి కోపం, అసూయ ఉండాలి. కానీ ఇద్దరికి అలాంటి ఏమీ ఉండవు. ఇద్దరు కూడా చాలా స్నేహంగా ఉంటారు. ప్రతి సందర్భంలో కూడా కలుస్తూ ఉంటారు. ఇప్పుడు బర్త్‌ డే విషెష్ చెప్పడం ద్వారా ఇద్దరి మధ్య ఎలాంటి ఆత్మీయ బంధం ఉందో అర్థం అవుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను చేస్తున్నాడు. వచ్చే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. మరో వైపు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ఎన్టీఆర్‌ రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మహేష్ బాబు ఈ ఏడాది ఆరంభంలో గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది చివర్లో వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.