Begin typing your search above and press return to search.

బాబోయ్ పిచ్చెక్కిస్తున్న ఎన్టీఆర్ లైనప్..!

కాస్త లైన్ అటుఇటైనా ఈ కాంబో కుదిరితే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా పండగ చేసుకుంటారని చెప్పొచ్చు

By:  Tupaki Desk   |   22 Sep 2024 8:05 AM GMT
బాబోయ్ పిచ్చెక్కిస్తున్న ఎన్టీఆర్ లైనప్..!
X

త్వరలో దేవరతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎన్టీఆర్ ఈ సినిమా తో తన మాస్ స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మొదటి భాగం 27న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా విషయంలో తారక్ నమ్మకం చాలా గట్టిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ ఈ పాటికి ఒకటికి రెండు సార్లు సినిమా చూసి ఉంటాడు కాబట్టి అందుకే ఫ్యాన్స్ కి ఈ సినిమా ఫీస్ట్ అందిస్తుందని బల్లగుద్ధి చెబుతున్నాడు తారక్.

దేవర 1 తర్వాత ఇప్పటికే వార్ 2 సినిమా కోసం షూటింగ్ లో పాల్గొన్న ఎన్టీఆర్ ఆ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా లైన్ లో ఉంది. ఆ సినిమా పూజా కార్యక్రమాలు ఈమహ్యనే జరిగాయి. మరోపక్క తమిళ దర్శకుడు వెట్రిమారన్ తో తారక్ సినిమా ఒకటి ప్లానింగ్ లో ఉంది. రీసెంట్ గా దేవర చెన్నై ప్రమోషన్స్ లో వెట్రిమారన్ డైరెక్షన్ లో చేయాలని ఉందన్న ఎన్టీఆర్ కామెంట్స్ తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా వస్తుందని అంటున్నారు.

వెట్రిమారన్ తర్వాత మరో తమిళ దర్శకుడు అట్లీ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. జవాన్ తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న అట్లీ మంచి కథతో వస్తే తారక్ కాదనకపోవచ్చు. ఇక యానిమల్ మేకర్ సందీప్ రెడ్డి వంగ కూడా తారక్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. స్పిరిట్, యానిమల్ 2, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ సినిమాల తర్వాత సందీప్ ఎన్ టీ ఆర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

వీరే కాకుండా ఎన్టీఆర్ తో బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి కూడా ఒక సినిమా అనుకుంటున్నాడట. ఇలా క్రేజీ డైరెక్టర్స్ అంతా కూడా తమ కథలకు తారక్ పర్ఫెక్ట్ అని భావిస్తున్నారు. కాస్త లైన్ అటుఇటైనా ఈ కాంబో కుదిరితే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా పండగ చేసుకుంటారని చెప్పొచ్చు. ఎన్టీఆర్ రాబోయే సినిమాలతో బాక్సాఫీస్ పై తన ముద్ర వేయాలని చూస్తున్నాడు.