Begin typing your search above and press return to search.

దేశంలో నంబ‌ర్-1 ధ‌నిక న‌టి ఎవ‌రో తెలుసా?

ఇండియాలో అత్యంత సంప‌న్న క‌థానాయిక‌ ఎవ‌రు? దీపిక‌, ఆలియా, క‌త్రిన‌, న‌య‌న‌తార ఇలా లీడింగ్ స్టార్ల‌ను ధ‌నిక న‌టీమ‌ణులుగా భావిస్తాం.

By:  Tupaki Desk   |   3 March 2025 9:00 AM IST
దేశంలో నంబ‌ర్-1 ధ‌నిక న‌టి ఎవ‌రో తెలుసా?
X

ఇండియాలో అత్యంత సంప‌న్న క‌థానాయిక‌ ఎవ‌రు? దీపిక‌, ఆలియా, క‌త్రిన‌, న‌య‌న‌తార ఇలా లీడింగ్ స్టార్ల‌ను ధ‌నిక న‌టీమ‌ణులుగా భావిస్తాం. కానీ వీళ్లెవరూ కాదు. వేల కోట్ల ఆస్తుల‌తో అత్యంత ధ‌నికురాలిగా జూహీ చావ్లా పేరు భార‌త‌దేశంలో వినిపిస్తుంది. మాధురి ధీక్షిత్, క‌రిష్మా క‌పూర్ ల కంటే జూహీచావ్లా సీనియ‌ర్. అగ్ర క‌థానాయిక‌గా సినీప‌రిశ్ర‌మ‌ను ఏలారు. హిందీ చిత్ర‌సీమ‌తో పాటు తెలుగు, త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్లోను జూహీ సుప‌రిచితురాలు. తెలుగు చిత్ర‌సీమ‌లో జూహీ చావ్లా `విక్కీ దాదా` చిత్రంలో నాగార్జున స‌ర‌స‌న న‌టించారు.

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ఎడిషన్ జూహీ చావ్లా పేరును రికార్డుల‌కెక్కింది. దేశంలో అత్యంత ధ‌నిక న‌టుడిగా షారూఖ్ నిలిస్తే.. మ‌హిళా న‌టీమ‌ణుల్లో జూహీ చావ్లానే నంబ‌ర్-1 ధ‌నికురాలిగా రికార్డుకెక్కింది. 4,600 కోట్ల నిక‌ర ఆస్తి విలువ‌తో జాబితాలో టాప్ లో ఉంది.

90ల‌లో హిందీ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటీమణుల్లో జూహీ చావ్లా ఒకరు. ఖయామత్ సే ఖయామత్ తక్‌తో తెరంగేట్రం చేసిన తర్వాత 90లలో బోల్ రాధా బోల్, డర్, లోఫర్, ఇష్క్ వంటి హిట్ చిత్రాలతో బాక్సాఫీస్‌ను శాసించింది. కానీ 2000 తర్వాత పూర్తిగా నిర్మాత‌గా కొన‌సాగారు. కొన్నిసార్లు సహాయ పాత్ర‌ల్లో క‌నిపించారు. జూహీ చిత్ర నిర్మాణంలో షారుఖ్ భాగస్వామి. మొదట డ్రీమ్స్ అన్‌లిమిటెడ్ .. ఇప్పుడు రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో జూహీ భాగ‌స్వామిగా ఉన్నారు. 2009 నుండి (లక్ బై ఛాన్స్ విడుదలైనప్పుడు) జూహీకి బాక్సాఫీస్ హిట్ లేకపోయినా, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పెట్టుబడి పెట్టడం .. నైట్ రైడర్స్ క్రికెట్ ఫ్రాంచైజీ సహ-యజమాని కావడం వల్ల జూహీ ఆదాయం ఎన్నో రెట్లు పెరిగింది.

జూహీ తన సన్నిహిత మిత్రుడు షారూఖ్ ఖాన్‌తో కలిసి రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీకి సహ-వ్యవస్థాపకురాలు. బాలీవుడ్ ప్రధాన నిర్మాణ సంస్థలలో ఇది ఒకటి. కొన్ని విజయవంతమైన చిత్రాలను నిర్మించింది. విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ సేవలు మొదలైన వాటిపై పరిశోధన, అభివృద్ధిలో కూడా కంపెనీ పాల్గొంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను జూహీ న‌డిపిస్తోంది. అందులో కూడా షారూఖ్ తో క‌లిసి ఆమె వాటాదారు. ఫ్రాంచైజ్ అత్యంత విజయవంతమైంది. జనాదరణ పొందింది..నిజానికి చాలా లాభదాయకంగా ఉంది. ఖాన్ తో పాటు జూహీ నికర ఆదాయ‌ విలువ పెర‌గ‌డానికి కేకేఆర్ టీమ్ ప్రధానంగా స‌హాయ‌ప‌డింది.

సినిమాలు - క్రీడలు కాకుండా జూహీ రియల్ ఎస్టేట్‌లోను భారీ పెట్టుబ‌డులు పెట్టారు. భారతదేశం అంతటా కొన్ని అత్యంత విలువైన ఆస్తులను జూహీ చావ్లా సొంతం చేసుకుంది. ఇది త‌న‌ ఆర్థిక స్థితిని మరింత అభివృద్ధి చేస్తుంది.

మహిళా నటుల మధ్య సంపద పోలిక చూస్తే.. జూహీ చావ్లా నికర ఆస్తి విలువ భారతదేశంలోని చాలా మంది ప్రముఖ నటీమణుల సంపదను అధిగమించింది. జుహీ చావ్లా -రూ.4,600 కోట్లు- $580 మిలియన్ లు కాగా, ఐశ్వర్య రాయ్ బచ్చన్ -రూ.850 కోట్ల నిక‌ర ఆస్తితో లీడింగ్ బ్యూటీగా నిలుస్తోంది. ప్రియాంక చోప్రా- రూ.650 కోట్ల నిక‌ర ఆస్తుల‌ను క‌లిగి ఉంది. ఐశ్వర్య రాయ్ (రూ. 900 కోట్లు), ప్రియాంక చోప్రా (రూ. 850 కోట్లు), అలియా భట్ (రూ. 550 కోట్లు), దీపికా పదుకొనే (రూ. 400 కోట్లు), కత్రినా కైఫ్ (రూ. 240 కోట్లు) వంటి అగ్ర‌శ్రేణి క‌థానాయిక‌ల ఆదాయాల‌న్నిటినీ క‌లిపినా అంత‌కుమించి అని జూహీ నిరూపించింది.