Begin typing your search above and press return to search.

జూలియానా ట్రైలర్: తెలుగు ద‌ర్శ‌కుడి ప్ర‌యోగం క్యూరియ‌స్

ఒక యువ‌తి ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె తల లోహపు కుండలో ఇరుక్కుపోయాక ఏం జ‌రిగింద‌నేది జులియానా క‌థాంశం.

By:  Tupaki Desk   |   19 Aug 2023 2:52 PM GMT
జూలియానా ట్రైలర్: తెలుగు ద‌ర్శ‌కుడి ప్ర‌యోగం క్యూరియ‌స్
X

ఒక లోహ‌పు బిందెలో చిక్కుకుపోయిన పిల్లి త‌ల‌.. అది ఎంత ప్ర‌య‌త్నించినా బ‌య‌ట‌కు రాక‌పోతే ఆ త‌ర్వాత పాట్లు ఎలా ఉంటాయో ఇంత‌కుముందు కామిక్స్ లో చూసి చాలా ఫ‌న్ ని ఆస్వాధించాం. కానీ ఇక్క‌డ ఒక అమ్మాయి త‌ల బిందెలో చిక్కుకుపోయాక మొద‌లైన పాట్లు ఎలాంటివో ఏకంగా స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో పూర్తి నిడివి సినిమానే తీశాడు తెలుగు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ మాంబుల్లి. అత‌డి ప్ర‌య‌త్నం అవార్డ్ కేట‌గిరీ. ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ చ‌ల‌న‌చిత్రోత్స‌వాల‌కు ఇది ఎంపికైంది.

ఒక యువ‌తి ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె తల లోహపు కుండలో ఇరుక్కుపోయాక ఏం జ‌రిగింద‌నేది జులియానా క‌థాంశం. సినిమా ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాడ‌ని తాజాగా రిలీజైన ట్రైల‌ర్ చెబుతోంది. శుక్రవారం సాయంత్రం దిలీప్‌ నటించిన 'వాయిస్‌ ఆఫ్‌ సత్యనాథన్‌' విజయోత్సవ వేడుకల సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

జూలియానా ఒక విభిన్న‌మైన ప్ర‌య‌త్నం. ఇందులో ఒకే పాత్ర ఉంటుంది. USP అక్కడే ముగియదు. జూలియానా ఎవ‌రో ముఖం కూడా క‌నిపించ‌దు. అలాగే సినిమాలో డైలాగులు లేవు కాబట్టి భాషాపరమైన అవరోధం లేదు. ప్రేక్షకులు వేగవంతమైన, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ కోసం వేచి చూసేంత గ్రిప్పింగ్ గా ట్రైలర్ క‌నిపిస్తోంది.

జూలియానా ఒక పెను స‌మ‌స్య‌లో చిక్కుకున్నాక‌.. తెలివైన సాహసోపేతమైన ప్రయత్నంతో ప్రాణాంతక పరిస్థితి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. సింగిల్ క్యారెక్టర్ ఫిల్మ్ కేట‌గిరీలో ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌లైన ఇతర సర్వైవల్ థ్రిల్లర్‌లకు భిన్న‌మైన ప్ర‌య‌త్న‌మిది. ముఖ్యంగా న‌టి ముఖం చిత్రంలో ఎప్పుడూ క‌నిపించ‌క‌పోవ‌డమే ఇక్క‌డ ట్విస్ట్. డైలాగ్స్ లేని ప్రపంచంలోనే తొలి సర్వైవల్ థ్రిల్లర్ కూడా జూలియానా. ప్రేమ, ఆశ, థ్రిల్‌తో నిండిన జులియానా ప్రయాణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా ఆస్వాధించవచ్చు. ప్రశాంత్ మాంబుల్లి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌. జూలియానా ఒక సర్వైవల్ థ్రిల్లర్.. సినిమాటోగ్రఫీ: సుధీర్ సురేంద్రన్, ఎడిటర్: సాగర్ దాస్, ప్రాజెక్ట్ డిజైనర్: ప్రియదర్శిని PM. ఈ చిత్రానికి సంగీతం ఎబిన్ పల్లిచ్చన్, ఆర్ట్ డైరెక్ట‌ర్: బినోయ్ తాళ్లకుళతుర్, సౌండ్ డిజైన్‌: జుబిన్ ఎబి, కలరిస్ట్: లిజు ప్రభాకర్ డి.