ఆ స్టార్ హీరోల వారసులిద్దరు ఒకేసారి!
అమీర్ ఖాన్..షారుక్ ఖాన్ ఎంత పెద్ద స్టార్లో చెప్పాల్సిన పనిలేదు. దశాబ్ధాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు
By: Tupaki Desk | 27 May 2024 8:30 AM GMTఅమీర్ ఖాన్..షారుక్ ఖాన్ ఎంత పెద్ద స్టార్ లో చెప్పాల్సిన పనిలేదు. దశాబ్ధాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న స్టార్లు. ఇద్దరి ఇమేజ్ దాదాపు సమానం. వయసులు కూడా సమానమే. 60కి అతి దగ్గరల్లో ఉన్నారు. దీంతో వారుసుల్ని దించాల్సిన అవసరం అంతే ఉంది. అందుకే వారు సైతం ఇదే ఏడాది పరిచయమవ్వడానికి రెడీ అవుతున్నారు. షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇదే ఏడాది దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
స్టార్ డమ్ అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నాడు. షారుక్ ఖాన్ జీవితం స్పూర్తితో దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ షారుక్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ పైనే నిర్మిస్తున్నాడు. బాబి డియోల్ మెయిన్ లీడ్ పోషించగా రణబీర్ కపూర్, కరణ్ జోహార్, రణవీర్ సింగ్ లాంటి నటులు గెస్ట్ రోల్స్ పోషించారు. అలా ఆర్యన్ తొలి వెబ్ సిరీస్ లోనే సూపర్ స్టార్లు తోడయ్యారు. తండ్రిలా హీరో అయి వారసత్వం కొనసాగిస్తాడు అనుకుంటే దర్శకుడిగానే ఆర్యన్ ఆసక్తిగా ఉన్నాడని తేలిపోయింది.
మరి అతడి ఎంతటి ప్రతిభావంతుడు...సృజనాత్మకత ఎలా ఉంటుందన్నది తేలాల్సి ఉంది. అలాగే అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కూడా ఇదే ఏడాది హీరోగా లాంచ్ అవుతున్నాడు. జునైద్ హీరోగా `మహరాజ్` అనే చిత్రాన్ని సిద్దార్ధ్ మల్హోత్రా తెరకెక్కిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తోంది. కొన్నినెలల క్రితమే షూటింగ్ పూర్తయిన అనివార్య కారణాలతో డిలే అయింది. తాజాగా ఈ చిత్రాన్ని జూన్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అటుపై విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్నిరిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అమీర్ ఖాన్ ఈ సినిమా ప్రచారంలోనూ పాల్గొనడానికి ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా కి సంబంధించి జునైద్ కి ఇప్పటివరకూ తండ్రి నుంచి సహకారం పెద్దగా లభించలేదు. సొంత ట్యాలెంట్ తో ఎదగాలి తప్ప తండ్రి ఇమేజ్ తో కాదని అమీర్ ఖాన్ భావించి పట్టించుకోలేదు. అయితే రిలీజ్ దగ్గరపడటంతో చివరి నిమిషంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి అమీర్ ఖాన్ ముందుకొస్తున్నారు. కానీ షారుక్ ఖాన్ మాత్రం ఆర్యన్ ఖాన్ కోసం అన్ని రకాల సహకారం అందిస్తున్నారు. కుమార్తె సుహానాఖాన్ ని కూడా హీరోయిన్ గా తన బ్యానర్ ద్వారానే పరిచయం చేస్తున్నారు.