Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ స్పెషల్‌... అమ్మలు హ్యాపీ బర్త్‌డే

జపాన్‌లో 'దేవర' ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ తాజాగా భార్య లక్ష్మీ ప్రణతితో ఉన్న ఫోటోను షేర్‌ చేశాడు.

By:  Tupaki Desk   |   26 March 2025 6:11 AM
ఎన్టీఆర్ స్పెషల్‌... అమ్మలు హ్యాపీ బర్త్‌డే
X

ఎన్టీఆర్‌ ప్రస్తుతం జపాన్‌లో ఉన్నాడు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న 'దేవర' సినిమాను ఈ వారంలో జపాన్‌లో విడుదల చేస్తున్నారు. ఆర్ఆర్‌ఆర్‌ సినిమాతో ఎన్టీఆర్‌ జపాన్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. అందుకే దేవర సినిమాను జపాన్‌లో అత్యధిక స్క్రీన్స్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రీమియర్‌ షోలు వేశారు. ప్రతి ప్రీమియర్‌ షోకి అనూహ్య స్పందన దక్కింది. ఇటీవల ఎన్టీఆర్‌ హాజరు అయిన ఒక ప్రివ్యూ షోకి భారీ ఎత్తున ప్రేక్షకులు రావడం కనిపించింది. ఆ ప్రీవ్యూ థియేటర్‌లో ఎన్టీఆర్‌కి అద్భుత స్వాగతం లభించింది. అక్కడ ఎన్టీఆర్ ఆయుద పూజ పాటకు డాన్స్ చేసి ప్రేక్షకులు అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు.


జపాన్‌లో 'దేవర' ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ తాజాగా భార్య లక్ష్మీ ప్రణతితో ఉన్న ఫోటోను షేర్‌ చేశాడు. 'అమ్మలు.. హ్యాపీ బర్త్‌ డే' అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రణతి పుట్టిన రోజును జపాన్‌లో అభిమానుల సమక్షంలో ఎన్టీఆర్‌ జరిపాడు. ఎన్టీఆర్‌ దేవర సినిమా ప్రమోషన్‌లో భాగంగానే జపాన్‌కి వెళ్లకుండా భార్యతో హాలీడేను కూడా ప్లాన్‌ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్టీఆర్‌ షేర్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్నాయి. లక్షల మంది లైక్ చేయడంతో పాటు ఎంతో మంది తమ సోషల్‌ మీడియా అకౌంట్‌లో ఆ ఫోటోలను షేర్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌, లక్ష్మీ ప్రణతి సరైన జోడీ అంటూ ఎప్పుడూ అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు. తాజా ఫోటోలతో మరోసారి అదే చర్చ జరుగుతోంది.


భార్య లక్ష్మి ప్రణతిపై ఎన్టీఆర్‌ తనకు ఉన్న ప్రేమను ఈ ఫోటో రూపంలో చెప్పకనే చెప్పడంతో పాటు క్యూట్‌గా అమ్మలు.. హ్యాపీ బర్త్‌డే అంటూ లవ్‌ ఈమోజీని షేర్‌ చేశాడు. తన భార్య గురించి ఎన్నో సార్లు ఎన్టీఆర్ గొప్పగా చెప్పిన విషయం తెల్సిందే. సినిమాలతో తాను ఎంతో బిజీగా ఉన్నా ఇంటి వ్యవహారాలు అన్ని తానే చక్కగా చూసుకుంటుందని ఎన్టీఆర్‌ పదే పదే చెబుతూ ఉంటాడు. ఇద్దరు కొడుకులతో పాటు, ఎన్టీఆర్ తల్లి సంరక్షణ బాధ్యతను లక్ష్మి ప్రణతి చూసుకుంటూ ఉంటుంది. ఎన్టీఆర్‌ కి ఇంటి వ్యవహారల విషయంలో ఎలాంటి చికాకు లేకుండా సినిమాలపై ఎక్కువ శ్రద్ద పెట్టే విధంగా లక్ష్మి ప్రణతి అన్ని చూసుకుంటారని ఆ ఫ్యామిలీకి దగ్గరగా ఉండే వారు చెబుతూ ఉంటారు. అంతే కాకుండా ఎన్టీఆర్ సైతం పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

మార్చి 28న 'దేవర' జపాన్‌లో ఆట షురూ కానుంది. విడుదలైన రోజు వరకు ఎన్టీఆర్‌ అక్కడే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అదే రోజున ఎన్టీఆర్‌ ఇండియాకు తిరిగి వస్తాడట. కొరటాల శివతో కలిసి అక్కడకు వెళ్లిన ఎన్టీఆర్‌ తిరిగి వచ్చిన వెంటనే ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌కి హాజరు కాబోతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ లేకుండా ఒక భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను షూట్‌ చేసిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ త్వరలో ప్రారంభం కాబోతున్న షెడ్యూల్‌లోనూ అదే యాక్షన్ ఎపిసోడ్‌ను ఎన్టీఆర్‌పై చిత్రీకరించబోతున్నాడు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో సుదీర్ఘ కాలపు షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారని, అతి త్వరలోనే సినిమా నుంచి కీలక అప్డేట్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఆ తేదీకి విడుదల కష్టమే అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.