Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి....!?

ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద ఆయన ఏ మాత్రం రియాక్ట్ కావడంలేదు. తాను అందరి వాడిని అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు

By:  Tupaki Desk   |   20 Dec 2023 2:45 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి....!?
X

యంగ్ టైగర్ అన్నా లయన్ అన్నా టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకు వస్తారు. ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్ కి సిసలైన వారసుడిగా మూడవ తరంలో తన సత్తా చాటుకుంటూ వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆయన సినిమాల మీద ఫోకస్ పెట్టేసారు.

ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద ఆయన ఏ మాత్రం రియాక్ట్ కావడంలేదు. తాను అందరి వాడిని అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకు రాజకీయాలు ప్రస్తుతానికి వద్దు సినిమాలే ముద్దు అని కూడా ఇండైరెక్ట్ గా జూనియర్ సంకేతం ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఎపుడు రాజకీయాల్లోకి వస్తారు అన్న దాని మీద ప్రముఖ జ్యోతీష్కుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఇప్పట్లో రాడు అని వేణు స్వామి ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. జూనియర్ మనసు అంతా ప్రస్తుతం సినిమాల మీదనే ఉంది అని అన్నారు.

ఇక జూనియర్ జాతకంలో రాజకీయ యోగం ఉందని ఆయన అంటూ 2030 తరువాత మాత్రమే రాజకీయాల్లోకి అడుగులు పెడతారని అంటున్నారు. అప్పటికి జూనియర్ కి రాజకీయంగా యోగం మొదలవుతుంది అని అన్నారు. జూనియర్ రాజకీయ జీవితం మీద వేణు స్వామి ఈ విధంగా కామెంట్స్ చేయడంతో ఆయన అభిమానుల నుంచి స్పందన వస్తోంది.

నిజానికి జూనియర్ 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేయాలని కోరుతున్న వారూ ఉన్నారు. టీడీపీకి ఈసారి ఎన్నికలు చాలా ముఖ్యమని అంతా అంటున్నారు. వైసీపీని ఢీ కొట్టి ఈసారి గెలవకపోతే మాత్రం టీడీపీకి ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.

దాంతో అన్ని విధాలుగా అందరినీ కలుపుకుని టీడీపీ ముందుకు సాగుతోంది. అయితే నందమూరి ఇంటివాడు అయిన జూనియర్ వస్తే ఆ జోష్ వేరు అన్నది టీడీపీ తమ్ముళ్ల మాట. టీడీపీలో భావి వారసుడుగా జూనియర్ ని టీడీపీలో చూసేవారు చాలా మంది ఉన్నారు. దాంతో జూనియర్ రాక కోసం వారంతా చూస్తున్నారు.

అయితే జూనియర్ మాత్రం పొలిటికల్ గా ఏ మాత్రం ఆసక్తి లేనట్లుగానే ఉన్నారు. దానికి తోడు ఆయన రాజకీయ వైభవం అంతా మరో ఏడేళ్ల తరువాతనే మొదలవుతుందని వేణు స్వామి జోస్యం చెప్పడంతో 2029 ఎన్నికలకు కూడా జూనియర్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడని అర్ధం అవుతోంది అంటున్నారు. అంటే జూనియర్ ఈ ఏడేళ్ల విలువైన కాలం అంతా సినిమాలకే పూర్తి సమయం కేటాయిస్తారు అన్న మాట. మరి వేణు స్వామి జోస్యం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.