Begin typing your search above and press return to search.

'వార్‌' కోసం ఎన్టీఆర్ కసరత్తులు షురూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు

By:  Tupaki Desk   |   18 Aug 2023 4:12 AM GMT
వార్‌ కోసం ఎన్టీఆర్ కసరత్తులు షురూ
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు. లాంగ్ బ్రేక్ లు తీసుకోకుండా ఎన్టీఆర్ కంటిన్యూ గా ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్ కార్యక్రమాలను నవంబర్ వరకు పూర్తి చేయాలని కొరటాల శివ టార్గెట్ గా పెట్టుకున్నాడని సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్ డిసెంబర్‌ లేదా వచ్చే ఏడాది జనవరి నుంచి వార్ 2 సినిమా షూటింగ్‌ లో పాల్గొంటాడని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ ను వార్ లో మరోసారి సిక్స్ ప్యాక్ బాడీ తో ప్రేక్షకులు చూడబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ అందుకోసం కసరత్తులు మొదలు పెట్టాడని కూడా టాక్ వినిపిస్తోంది.

టెంపర్‌ తర్వాత అరవింద సమేత ఇంకా ఆర్‌ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాడు. ఆ సినిమాల్లో ఎన్టీఆర్ లుక్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా ఎన్టీఆర్ రేంజ్‌ ఆర్‌ఆర్ఆర్ సినిమా తో అమాంతం పెరిగింది. ఎన్టీఆర్ కి హాలీవుడ్‌ స్థాయిలో అభిమానులు క్రియేట్ అవ్వడం మాత్రమే కాకుండా.. ఇతర దేశాల్లో కూడా ఎన్టీఆర్ నటనను కీర్తించిన దాఖలాలు ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్ లో కొమురం భీమ్ గా అద్భుతమైన నటన కనబర్చిన కారణంగానే ఎన్టీఆర్‌ కి హృతిక్ రోషన్ 'వార్‌ 2' సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్లుగా టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ దేవర సినిమా లో తన రెగ్యులర్ లుక్ లోనే కనిపించబోతున్నాడు. అయితే మేకోవర్ కాస్త వైవిధ్యం గా ఉండే అవకాశాలు ఉన్నాయి.

దేవర సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు. వార్ 2 కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మొదలు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ అభిమానులకు కన్నుల విందు ఖాయం అన్నట్లుగా తెలుస్తోంది.