Begin typing your search above and press return to search.

దీపావళికి టైగర్ తో రాబోతున్న ఎన్టీఆర్‌..!

గత కొన్నాళ్లుగా సల్మాన్ ఖాన్‌ హీరోగా నటిస్తున్న టైగర్ 3 సినిమా లో వార్‌ 2 కి సంబంధించిన పాత్ర లను పరిచయం చేయబోతున్నారు

By:  Tupaki Desk   |   29 Sep 2023 8:25 AM GMT
దీపావళికి టైగర్ తో రాబోతున్న ఎన్టీఆర్‌..!
X

బాలీవుడ్‌ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ 'వార్‌ 2' సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ హృతిక్ రోషన్ హీరోగా రూపొందుతున్న సినిమా లో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించబోతున్నట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక ఈ సినిమా గురించి బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో తెగ చర్చ జరుగుతోంది.

గత కొన్నాళ్లుగా సల్మాన్ ఖాన్‌ హీరోగా నటిస్తున్న టైగర్ 3 సినిమా లో వార్‌ 2 కి సంబంధించిన పాత్ర లను పరిచయం చేయబోతున్నారు. హాలీవుడ్ లో ఇలాంటి పాత్రల పరిచయం ఉంటుంది. బాలీవుడ్ లో చాలా అరుదుగా ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఒక సినిమాకు మరో సినిమాకు లింక్ పెడుతూ సినిమాలను రూపొందించే కొత్త ఆనవాయితీకి యష్ రాజ్ ఫిల్మ్స్ వారు తెర తీస్తున్నారు.

అందులో భాగంగానే దీపావళికి రాబోతున్న టైగర్ 3 సినిమా లో వార్ 2 కి సంబంధించిన పాత్రలను పరిచయం చేయడంతో పాటు, వార్ 2 సినిమాపై అంచనాలు పెరిగే విధంగా ఆసక్తికరంగా స్క్రీన్‌ ప్లే ను రన్‌ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. వార్ 2 లో కీలక పాత్రలో కనిపించబోతున్న ఎన్టీఆర్ ను టైగర్ 3 లో చూపిస్తారట.

ఆలియా భట్ ఒక స్పై ఏజెంట్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ తో పాటు టైగర్ 3 లో ఎంతో మంది ముఖ్యమైన నటీనటులు కొంత మేరకు కనిపించబోతున్నారు. టైగర్ 3 లో పఠాన్ కి సంబంధించిన పాత్రలు కూడా తారసపడబోతున్నాయి అంటున్నారు. మొత్తానికి టైగర్ 3 ఒక ఫుల్‌ ప్యాకేజీ మూవీ గా ఉంటుంది అంటూ బాలీవుడ్ వర్గాల టాక్‌.