Begin typing your search above and press return to search.

వాళ్ల పేర్లు బ‌ట్ట బ‌య‌ల‌య్యేదెప్పుడు?

మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీని జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక ఒణికిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Aug 2024 6:31 AM GMT
వాళ్ల పేర్లు బ‌ట్ట బ‌య‌ల‌య్యేదెప్పుడు?
X

మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీని జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక ఒణికిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా మంది న‌టీమ‌ణులు మీడియా ముందుకొచ్చి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. ఇంకా ఆ పర్వం కొన‌సాగుతోంది. రోజుకో న‌టి చొప్పున త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ ఆరోపిస్తున్నారు. చివ‌రికి ట్రాన్స్ జెండ‌ర్ల‌ను సైతం కామంధులు విడిచిపెట్ట‌న‌ట్లు వెలుగులోకి వ‌స్తోంది. ఇదంతా ఒక వెర్ష‌న్ అయితే ఆ నివేదిక‌లో ఎంత మంది పేర్లు ఉన్నాయి? వాళ్లు ఎవ‌రెవ‌రు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

దీంతో లైంగిక దాడుల‌కు పాల్పిడిన వారంద‌రి గుండెల్లోనూ ఇప్పుడు రైళ్లు ప‌రిగెడుతున్న‌ట్లే లెక్క‌. ఇప్ప‌టికే మలయాళ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప‌ద‌వికి సందీప్ సిద్ధిఖీ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఇంకా ఇలాంటి వారు ఇండ‌స్ట్రీలో ఎంతమంది ఉన్నారు. ఇంకెంత మంది ప‌ద‌వులు ఊడ‌ను న్నాయి? అధికారం...అంద‌బ‌లం.. న‌టులం అన్న క్రేజ్ తో ఇంకెలాంటి దురాగ‌తాల‌కు తెగ‌బ‌డ్డారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంకా హేమ కమిటీ ఎవ‌రి పేర్ల‌ను బ‌ట్ట బ‌య‌లు చేయ‌లేదు.

అంద‌రి పేర్ల‌ను గోప్యంగానే ఉంచింది. అయితే వీళ్లంద‌ర్నీ ర‌హాస్యంగా విచారిస్తుందా? లేక మీడియా ముందు ప్ర‌వేశ పెట్టిన త‌ర్వాత అదుపులోకి తీసుకుంటారా? అన్న‌ది చూడాలి. ఈ నేప‌థ్యంలో మ‌ల యాళం స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ క‌మిటీ నివేదిక‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. నిజంగా త‌ప్పు జ‌రిగితే అలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన వారంద‌ర్నీ త‌ప్ప‌కుండా క‌ఠినంగా శిక్షించాల్సిందే.

ఏ ఒక్క‌రిని విడిచి పెట్ట కూడ‌దు. ఒక‌వేళ ఇవ‌న్నీ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు అయితే అలాంటి ప‌నికి పూనుకున్న వాళ్ల‌ను అంతే శిక్షించాలి. నిందితుల పేర్ల‌ను చెప్పాలా? వ‌ద్దా? అన్నది క‌మిటీ నిర్ణ‌యం మీద‌నే ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు. హేమ క‌మిటీతో మాట్లాడిన మొద‌టి వ్య‌క్తిని నేనే. ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళ‌లు ఎదుర్కోంటోన్న స‌మ‌స్య‌ల‌ను క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేయాలి` అని అన్నారు.