Begin typing your search above and press return to search.

స్టన్నింగ్ జ్యోతి.. అందమే అసూయ పడేలా..

సీరియల్ లో జగతి మేడమ్ రోల్ లో కనిపించిన ఆమెకు ఫ్యాన్ బేస్ వేరే లెవెల్ లో ఉందనే చెప్పాలి. తక్కువ టైమ్ లో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న జ్యోతి..

By:  Tupaki Desk   |   8 Jan 2025 3:15 AM GMT
స్టన్నింగ్ జ్యోతి.. అందమే అసూయ పడేలా..
X

జగతి మేడమ్.. అలియాస్ జ్యోతి పూర్వాజ్ గురించి తెలుగు బుల్లితెర ఆడియన్స్ లో తెలియని వారుండరని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. హైయెస్ట్ టాప్ రేటింగ్ తో కొన్నాళ్ల పాటు సీరియల్ ప్రపంచాన్ని ఏలిన గుప్పెడంత మనసు ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమైంది కన్నడ బ్యూటీ జ్యోతి పూర్వాజ్.

సీరియల్ లో జగతి మేడమ్ రోల్ లో కనిపించిన ఆమెకు ఫ్యాన్ బేస్ వేరే లెవెల్ లో ఉందనే చెప్పాలి. తక్కువ టైమ్ లో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న జ్యోతి.. అందం, అభినయంతో మెప్పించింది. అటు తల్లి పాత్రలో.. ఇటు టీచర్ రోల్ లో జీవించేసిందని చెప్పడంలో ఆలోచించక్కర్లేదేమో.

అయితే సడెన్ గా ఆ సీరియల్ నుంచి తప్పుకున్న.. సినిమాలు, వెబ్ సిరీసులతో ఫుల్ బిజీగా మారిపోయింది. దర్శక నిర్మాత పూర్వాజ్.. ఆమెను సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేశారు! ఆ తర్వాత ఏ మాస్టర్ పీస్ మూవీ టైమ్ లో ప్రేమలో పడ్డి ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. భర్త తీసిన శుక్ర, మాటరాని మౌనమిది చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది జ్యోతి.

ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్న అమ్మడు.. సోషల్ మీడియాలో చేసే సందడి మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు ట్రెండీ డ్రెస్సుల్లో, పొట్టి బట్టల్లో వేరే లెవెల్ లో అందాలు ఆరోబోస్తుంటుంది. అలా రోజురోజుకూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న ముద్దుగుమ్మ.. తన ఫ్యాన్స్ ను అస్సలు డిస్పాయింట్ చేయదనే చెప్పాలి.

తాజాగా కిర్రాక్ పిక్ ను పోస్ట్ చేసిన జ్యోతి.. ఒక్కసారిగా అందరినీ ఫ్లాట్ చేసేసింది. తన గ్లామరస్ లుక్ తో మైండ్ బ్లాక్ చేసిన అమ్మడు.. మైమరపించే పోజు ఇచ్చిందనే చెప్పాలి. సోఫాలో కూర్చున్న బ్యూటీ.. మోడ్రన్ డ్రెస్ లో కనిపించగా.. అంతా ఫిదా. అయితే జ్యోతి అంద చందాలకు ఎవరైనా క్లీన్ బౌల్డ్ అవ్వకుండా ఉండరేమో.

ప్రస్తుతం జ్యోతి పిక్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. బ్యూటిఫుల్ మేడమ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అందమే అసూయ పడేలా ఉన్నారని చెబుతున్నారు. లైకులు కొడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. మేడమ్ సర్ మేడమ్ అంతే అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.