Begin typing your search above and press return to search.

జ్యోతి రాయ్.. చిరునవ్వు వెనుక మెరిసే అందం

టెలివిజన్ నటీమణులు కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   24 Nov 2024 2:45 AM GMT
జ్యోతి రాయ్.. చిరునవ్వు వెనుక మెరిసే అందం
X

టెలివిజన్ నటీమణులు కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్నారు. గ్లామర్ విషయంలో నేటితరం స్టార్ హీరోయిన్స్ తో కూడా పోటీ పడుతుండడం విశేషం. ఇక అలాంటి వారిలో జ్యోతి రాయ్ కూడా ఉన్నారని చెప్పవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పేరు జ్యోతి పూర్వాజ్. అమ్మడు తన తాజా ఫోటోలను షేర్ చేయగానే నెటిజన్ల ప్రశంసల వర్షం కురుస్తోంది.

చీరలో ఆమె అందమైన చిరునవ్వు, చక్కటి మేకప్‌తో తీసుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. బ్లాక్ చీరలో ఆమె సాంప్రదాయాన్ని అలాగే లేటెస్ట్ గ్లామర్ స్టైల్ కు తగ్గట్లే అందాలను ఒకే ఫ్రేములో హైలెట్ చేసింది. ఈ లుక్స్ ఆమె అభినయాన్ని మరియు ఫోటోజెనిక్ లుక్స్‌ను మరింత హైలైట్ చేస్తున్నాయి.

జ్యోతి పూర్వాజ్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె తన నటనా ప్రయాణాన్ని చిన్న సినిమాల ద్వారా మొదలుపెట్టింది. సహజమైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ బ్యూటీ, క్రమంగా వెబ్ సిరీస్‌లకు కూడా దగ్గరైంది. ‘బ్యూటీ విత్ బ్రెయిన్’గా పేరు తెచ్చుకున్న జ్యోతి, సింపుల్ పాత్రలను కూడా మెమరబుల్‌గా మార్చగల సత్తా కలిగి ఉంది. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషలలో కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

టెలివిజన్ సీరియల్ 'గుప్పుడెంత మనసు'లో అద్భుతమైన పాత్రలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. ఇక ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం కూడా ఆమెకు అభిమానుల్ని మరింత దగ్గర చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టుల ద్వారా స్టైల్ స్టేట్‌మెంట్స్, గ్లామర్ ఫోటోషూట్లు పంచుకుంటూ ట్రెండ్ సెట్ చేస్తోంది. తాజా ఫోటోల్లో ఆమె చిరునవ్వు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. నెటిజన్లు ఆమె అందం గురించి పొగిడుతూ ఆమెను రాబోయే సూపర్‌స్టార్‌గా అభివర్ణిస్తున్నారు.

జ్యోతి తన ప్రతిభ, అందంతో పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందుతోంది. త్వరలోనే పెద్ద బ్రేక్ ఆమెను హీరోయిన్స్ చేర్చుతుందని అభిమానులు ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుతం హీరోయిన్ గా ప్రయోగాత్మక కథల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి. అలాగే తమిళంలో కూడా అమ్మడు గట్టిగానే ప్రయత్నం చేస్తోంది.