Begin typing your search above and press return to search.

ఘాటైన లుక్కులో గోల్డెన్ బ్యూటీ!

ఇటీవల, గోల్డ్ గౌన్‌లో దిగిన ఫోటోలు సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను గణనీయంగా పెంచాయి.

By:  Tupaki Desk   |   1 Dec 2024 2:45 AM GMT
ఘాటైన లుక్కులో గోల్డెన్ బ్యూటీ!
X

తెలుగు టెలివిజన్ రంగానికి సీరియల్స్ ద్వారా పరిచయం అయిన జ్యోతి పూర్వజ్ తన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందింది. గుప్పెడంత మనసు సీరియల్‌లో తల్లి పాత్ర పోషించినప్పటికీ, ఆ పాత్ర అనంతరం గ్లామర్‌ వైపు యూ టర్న్ తీసుకుంది. ప్రస్తుతం జ్యోతి పూర్వజ్ తన కొత్త ప్రాజెక్ట్‌లు, గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియా లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఇటీవల, గోల్డ్ గౌన్‌లో దిగిన ఫోటోలు సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను గణనీయంగా పెంచాయి.


జ్యోతి పూర్వజ్ తన అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటూ, కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. ఈ ఫోటోలో ఆమె బోల్డ్ లుక్, సొగసైన గోల్డ్ గౌన్, మెడలో హారం ఆమె అందాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. గ్లామర్‌ను పెంచుతూ, తన వ్యక్తిత్వాన్ని దృఢంగా ప్రదర్శిస్తూ, జ్యోతి పూర్వజ్ ఎక్కడా తగ్గలేదు. "బోల్డ్ స్పిరిట్ ర్యాప్‌డ్ ఇన్ గోల్డ్" అనే క్యాప్షన్‌ ఆమె స్టైల్‌కు సరైన నిర్వచనంగా నిలిచింది. గోల్డ్ కలర్ డ్రెస్ ఆమె స్కిన్ టోన్‌కు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ కావడంతో, ఫోటోకు ఎక్స్‌ట్రా ఆకర్షణ తీసుకువచ్చింది.

జ్యోతి పూర్వజ్ ప్రస్తుతం మూడు నుంచి నాలుగు ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉంది. ‘ఏ మాస్టర్ పీస్’ అనే సూపర్ హీరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా, భర్త సుకు పూర్వజ్ దర్శకత్వంలోనే మరో సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇవి కాకుండా ఆమె చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. జ్యోతి తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు తన గ్లామర్ షోను కూడా స్ట్రాటజీగా ఉపయోగించుకుంటోంది. ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్ మంత్రతో స్లిమ్‌గా కనిపిస్తూ, గ్లామర్‌తో పాటు నటనలోనూ ఎక్సపర్ట్‌గా ఎదగాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తోంది.

సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతోంది. రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పోస్ట్ చేస్తూ, గ్లామర్‌ను మరో మెట్టు ఎక్కిస్తోంది. ఇటువంటి ఫోటోలు మాత్రమే కాకుండా, ఆమెను లేడీ సూపర్ స్టార్‌గా చూడాలనే అభిమానుల ఆశలను మరింత పెంచుతున్నాయి. జ్యోతి పూర్వజ్ తన బోల్డ్ లుక్స్‌తో పాటు సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలతో తనకంటూ ఒక శైలిని సృష్టిస్తోంది. ఇక టాలీవుడ్‌లో మరింత గుర్తింపు పొందేందుకు ఆమెకు మంచి ప్రాజెక్ట్‌లు రావాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.