జ్యోతిరాయ్.. కూల్ అండ్ క్లాసీ లుక్
కారులో కూర్చుని సాలిడ్ పోజ్ ఇస్తూ తీసుకున్న ఈ ఫోటోలో ఆమె ప్రత్యేకమైన అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు.
By: Tupaki Desk | 7 Nov 2024 2:30 AM GMTటాలీవుడ్ బ్యూటీ జ్యోతి పూర్వాజ్ తన ప్రత్యేకమైన స్టైల్‌తో సోషల్ మీడియాలో మరొకసారి హల్చల్ చేస్తోంది. కారులో కూర్చొని సన్ గ్లాసెస్ తో కూల్ లుక్‌లో దిగిన ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సింపుల్ ఎమోజీలతో క్యాప్షన్ ఇస్తూ ఈ ఫోటోలో తన గ్లామర్‌ను హైలెట్ చేస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కారులో కూర్చుని సాలిడ్ పోజ్ ఇస్తూ తీసుకున్న ఈ ఫోటోలో ఆమె ప్రత్యేకమైన అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు.
పెర్ఫెక్ట్ స్టైలింగ్‌తో తీసుకున్న ఈ ఫోటోలో జ్యోతి వేసుకున్న క్యూట్ డ్రెస్ ఆమె గ్లామర్‌ను మరింత హైలైట్ చేస్తోంది. సన్‌గ్లాసెస్, కాస్ట్యూమ్స్ తీరుతో మోడ్రన్ లుక్‌లో కనువిందు చేస్తోన్న ఆమె ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను కలిగి ఉంది. హైలైట్‌గా నిలుస్తోన్న ఆమె డ్రెస్సింగ్ సెన్స్, కూల్ అండ్ క్లాసీ లుక్స్‌తో అభిమానుల మనసును దోచుకుపోతున్నారు.
ఈ ఫోటోకు ఇన్‌స్టాలో 10,000కుపైగా లైకులు, 100కు పైగా కామెంట్లు రావడం చూస్తే ఆమె పాపులారిటీ మరింత పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. జ్యోతి పూర్వాజ్ తరచూ ఇలాంటి గ్లామరస్ ఫోటోషూట్లు చేస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సాధారణ గ్లామర్ లుక్‌లోనే కాకుండా, కారు బ్యాక్‌డ్రాప్‌లో ఇలాంటి స్టైలిష్ ఫోటోలు ఆమెను మరింత ప్రత్యేకంగా చూపిస్తున్నాయి.
జ్యోతి పూర్వాజ్ కెరీర్ టెలివిజన్ ద్వారా మొదలైంది. టీవీ సీరియల్స్‌లో వివిధ రకాల పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. చిన్న తెరపై ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ అవకాశాలు ఆమెకు సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టడానికి దారి తీశాయి. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా, సీరియస్ పాత్రలతో కూడా మంచి అభినందనలు పొందారు.