ఆ ఒక్క పాత్ర కారణంగా సిరీస్ ప్రభావిత కాదు!
మేల్ డామినేటెడ్ ప్రపంచంలో కథానాయికలకు ప్రాధాన్యత ఉందని నిరూపించిన నటి జ్యోతిక.
By: Tupaki Desk | 8 March 2025 9:23 AM ISTమేల్ డామినేటెడ్ ప్రపంచంలో కథానాయికలకు ప్రాధాన్యత ఉందని నిరూపించిన నటి జ్యోతిక. కోలీవుడ్ సహా సౌత్ నార్త్ లో జ్యోతిక సుపరిచితురాలు. గ్లామర్ ఎలివేషన్ తో పాటు, నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో జ్యోతిక నటించి మెప్పించారు. ఇక హీరో సూర్యను పెళ్లాడాక, మామ్ అయిన కొన్నేళ్ల వరకూ జ్యోతిక ముఖానికి రంగేసుకోలేదు.
కొంత గ్యాప్ తర్వాత నటిగా జ్యోతిక సత్తా చాటింది. ఏడాది కాలంగా జ్యోతిక హిందీ చిత్రసీమలోను సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. అక్కడ వరుసగా ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. తాజాగా జ్యోతిక ప్రధాన పాత్రలో హితేష్ భాటియా దర్శకత్వం వహించిన హిందీ వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ఫిబ్రవరి 28న నెట్‌ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ఈ సిరీస్‌ను చూసిన తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది మిశ్రమ స్పందనలు వ్యక్తం చేసారు. సిరీస్ కేవలం వన్ టైమ్ వాచ్ అని రాసారు. జ్యోతిక ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది. అయితే తన నటప్రదర్శన గురించి అంతగా చర్చ లేదు. వెబ్ సిరీస్ లో జ్యోతిక చాలా పరిమిత పాత్రలో నటించింది. తన పాత్ర కారణంగా సిరీస్ ప్రభావితం కాదు. ఓటీటీలో ఒకసారి చూస్తే చాలు అనిపించే రొటీన్ వెబ్ సిరీస్ గా ముద్ర పడింది. అయితే దీని నుంచి కంబ్యాక్ అయ్యేందుకు జ్యోతిక వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే జ్యోతిక ఇప్పుడు అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ విడుదలైన తర్వాత విజయవంతమై జ్యోతిక తన నటనా జీవితంలో ఎంతో అవసరమైన పురోగతిని సాధించడంలో సహాయపడుతుందో లేదో వేచి చూడాలి.