Begin typing your search above and press return to search.

సూర్య భార్యగా ఉన్నా లింగవివక్ష తప్పట్లేదు!

స్టార్ హీరోయిన్ జ్యోతిక గురించి అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వివిధ సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

By:  Tupaki Desk   |   27 Feb 2025 5:58 AM GMT
సూర్య భార్యగా ఉన్నా లింగవివక్ష తప్పట్లేదు!
X

స్టార్ హీరోయిన్ జ్యోతిక గురించి అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వివిధ సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత స్టార్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న బ్యూటీ.. చెన్నైకి షిఫ్ట్ అయింది. వీళ్లిద్దరూ పూవెల్లం కేట్టుపార్, మాయావి, కాక్క కాక్క, ఉయిరిలే కలందదు, పేరళగన్, జూన్ ఆర్ సినిమాల్లో కలిసి నటించారు.

పూవెల్లం కేట్టుపార్ సినిమా టైమ్ లో ప్రేమలో పడ్డ వీరు.. 7 ఏళ్ల ప్రేమలో మునిగితేలారు. 2006 సెప్టెంబర్ 11న మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న జ్యోతిక.. కొంత కాలం గ్యాప్ ఇచ్చింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 36 వయదినిలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ.

అయితే రీఎంట్రీలో మహిళా ప్రధాన కథలు ప్రాధాన్యతనిస్తూ నటిస్తోందని చెప్పాలి. మహిళా మట్టుం, నాచ్చియార్, చెక్క శివంత వానం, కాట్రిన్ మొళి, రాక్షసి వంటి పలు సినిమాల్లో నటించి మంచి విజయాలు అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ చేసిన జ్యోతిక.. షైతాన్, శ్రీకాంత్ వంటి మూవీల్లో యాక్ట్ చేసి మెప్పించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మెయిన్ రోల్ లో వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ తెరకెక్కుతోంది. మరికొన్ని గంటల్లో ఆ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వనుండగా.. వరుస ప్రమోషన్స్ తో సందడి చేస్తోంది. తాజాగా తాను కూడా లింగ‌ వివ‌క్ష‌ను ఎదుర్కొన్నట్లు తెలిపింది. ప్రస్తుత రోజుల్లో లింగ వివక్ష అనేది కామన్ అయిపోయిందని జ్యోతిక చెప్పుకొచ్చింది.

తాను సూర్యను పెళ్లి చేసుకున్నాక సమాజంలో ఇప్పటికీ లింగ వివక్షను ఎదుర్కొంటున్నట్లు జ్యోతిక చెప్పడం గమనార్హం. తాను ఎప్పుడైనా ఏదైనా ఇంట‌ర్వ్యూల‌లో సూర్యని పెళ్ళి చేసుకున్నందుకు లక్కీ అని చెబితే.. ప్ర‌జ‌లు సూర్య చాలా మంచి వాడు అంటారని తెలిపింది. తాను ఎక్క‌డా క‌నిపించ‌నని, ఎందుకంటే స‌మాజం అలా చిత్రీక‌రిస్తుందంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

"నిజానికి వస్తువులు కొనుగోలు చేసిన విషయంలో కూడా ఎప్పుడూ లింగ వివ‌క్షను ఎదుర్కొంటాం. ఒక కారు లేదా ఇంకా ఏదైన వ‌స్తువు కొన్న‌ప్ప‌టికీ దాని ఫీచ‌ర్లు ఇంకొకరు చూడాల్సిందేనని అనే ధోరణి ఉంది. మహిళలు సరైన నిర్ణయాలు తీసుకోలేరని అంటుంటారు. అది ఒక చిన్న చూపు లాంటిది. కొన్నిసార్లు గుర్తింపు కూడా ఉండదు" అని తెలిపింది. ప్రస్తుతం జ్యోతిక వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.