Begin typing your search above and press return to search.

జ్యోతిక ప‌క్క‌నే ఉన్న అరేబియ‌న్ గుర్రాన్ని గుర్తు ప‌ట్టారా?

మంచి క‌థ‌- కంటెంట్ ఉన్న సినిమాల‌తో ఆక‌ట్టుకుంటోంది జ్యోతిక‌. ఇటీవ‌లే శ్రీ‌కాంత్ అనే బ‌యోపిక్‌లో రాజ్ కుమార్ రావుతో పాటు కీల‌క‌పాత్ర‌లో నటించింది.

By:  Tupaki Desk   |   27 May 2024 12:30 AM GMT
జ్యోతిక ప‌క్క‌నే ఉన్న అరేబియ‌న్ గుర్రాన్ని గుర్తు ప‌ట్టారా?
X

మంచి క‌థ‌- కంటెంట్ ఉన్న సినిమాల‌తో ఆక‌ట్టుకుంటోంది జ్యోతిక‌. ఇటీవ‌లే శ్రీ‌కాంత్ అనే బ‌యోపిక్‌లో రాజ్ కుమార్ రావుతో పాటు కీల‌క‌పాత్ర‌లో నటించింది. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌కు అద్బుత ప్ర‌శంస‌లు కురిసాయి. తాజాగా జ్యోతిక‌ తన తోబుట్టువులతో కలిసి దిగిన ఫోటో ఒక‌టి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోటోలో క‌నిపిస్తున్న నాటి మేటి హీరోయిన్ లు ఎవ‌రో గుర్తు పుట్ట‌గ‌ల‌రా? తన సోదరీమణులు నగ్మా - రష్మీతో పాటు వారి పిల్లలతో కలిసి జ్యోతిక‌ పోజులిచ్చింది.


వైరల్ ఫోటోలో జ్యోతిక బూడిద రంగు టీ షర్ట్ ధ‌రించి క‌నిపించింది. త‌న‌ సోదరీమణులు నగ్మా - రోష్ని నీలిరంగు దుస్తుల్లో క‌నిపించారు. ఆ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మరొక ఫోటోలో జ్యోతిక రగ్డ్ జీన్స్‌తో తెల్లటి షర్ట్‌లో పోజులివ్వ‌గా, రోషిణి ష్రగ్, బాడీ ఫిట్ బ్లూ జీన్స్‌తో బ్లాక్ టాప్ ధరించి కనిపించింది.

జ్యోతిక సోదరీమణులందరూ నటీనటులే. వారిలో నగ్మా అంద‌రికంటే పెద్దది. కుటుంబం నుంచి తొలిగా నటనా రంగ ప్రవేశం చేసింది న‌గ్మాయే. జ్యోతిక రెండోది కాగా రోషిణి అందరికంటే చిన్నది. జ్యోతిక సినిమాల్లో ఖుషి, కాక కాఖా, చంద్రముఖి. 36 వయదినిలే వంటి చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్లు సాధించాయి. కొంతకాలం క్రితం అజయ్ దేవగన్ నటించిన సైతాన్ లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ది యానిమేటర్స్, డబ్బా కార్టెల్‌ సహా ప‌లు చిత్రాల్లో న‌టిస్తూ జ్యోతిక బిజీగా ఉంది.

ప్రముఖ సౌత్ నటుడు సూర్యతో జ్యోతిక వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత కూడా ఆమె తరచూ సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇక అక్కా చెల్లెళ్ల కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సెల్వ తెర‌కెక్కించిన‌ హాస్య వెంచర్ శిష్యలో కార్తీక్‌తో కలిసి రోషిణి తన అరంగేట్రం చేసింది. ఆ తరువాత మాస్టర్, పవిత్ర ప్రేమ, ప్రేమ లేఖలు వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది.

ఇక సిస్ట‌ర్స్ లో అంద‌రి కంటే పెద్ద‌ది అయిన నగ్మా టాలీవుడ్ ని ద‌శాబ్ధం పైగానే ఏలింది. పెద్దింటి అల్లుడు, కిల్లర్, ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్, వారసుడు, అల్లరి అల్లుడు, రిక్షావోడు వంటి ఐకానిక్ చిత్రాలలో తన పాత్రలకు ప్రశంసలు అందుకుంది. అలాగే కున్వరా, కాదలన్, సిటిజెన్ వంటి చిత్రాలతో కీర్తిని పొందింది. సల్మాన్ ఖాన్ సరసన `బాఘీ: ఎ రెబెల్ ఫర్ లవ్‌` చిత్రంతో హిందీ సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రం 1990లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఏడవ చిత్రంగా నిలిచింది. పరిశ్రమలో సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుంది.

ముఖ్యంగా కె.రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించిన ఘ‌రానా మొగుడులో మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న పొగ‌రుమోతు ఫ్యాక్ట‌రీ య‌జ‌మానిగా న‌టించి కుర్ర‌కారు గుండెల్లో నిలిచిపోయింది. ఆ చిత్రంలో న‌గ్మా న‌ట‌న‌కు ఫిదా కాని వారు లేనే లేరు. అలాగే న‌గ్మాను అరేబియ‌న్ గుర్రం అని పిలిచిన అభిమానులు.. న‌గ్మా అంద‌చందాలు న‌ట‌న‌కు ఫుల్ ఫిదా అయిపోయారు.

న‌గ్మా కెరీర్ ప‌రంగా పీక్స్ లో ఉండ‌గానే జ్యోతిక తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. అప్ప‌టికి నగ్మా తమిళం- తెలుగు సినిమాల‌లో ప్రముఖ నటిగా వెలుగొందుతోంది. జ్యోతిక - నగ్మా సోదరీమణులు తమిళ చిత్రసీమలో ప్రముఖ నటీమణులుగా చాలా కాలం పాటు సైమ‌ల్టేనియ‌స్ గా కొన‌సాగారు. మ‌రోవైపు రోష్ని కొన్ని సినిమాల్లో న‌టించి త‌రవాత వ్య‌క్తిగ‌త జీవితంలో సెటిల‌య్యారు.