లేడీ ఓరియేంటెడ్ చిత్రాలకు అదే సరైన ఏజ్!
ఫాంలో ఉన్న భామలకు లేడీ ఓరియేంటెడ్ ఆఫర్లు వస్తే మరో ఆలోచన లేకుండా చేస్తుంటుంది.
By: Tupaki Desk | 7 May 2024 12:30 PM GMTఫాంలో ఉన్న భామలకు లేడీ ఓరియేంటెడ్ ఆఫర్లు వస్తే మరో ఆలోచన లేకుండా చేస్తుంటుంది. అందుకు వయసు అనేది ఎక్కడా అడ్డు రాదు. ఈ తరహా సినిమాలు చేయాలంటే స్టార్ డమ్ ఉంటే సరిపోతుంది. తన బ్రాండ్ తో జనాల్ని థియేటర్ కి రప్పించగలదు అన్న నమ్మకం దర్శక-నిర్మాతలకు ఉంటే చాలు. ఉమెన్ సెంట్రిక్ చిత్రం పట్టాలెక్కుతుంది. ఈ తరహా సినిమాలంటే కేవలం సీనియర్ నాయికలే చేయాలనేం లేదని అలియాభట్.. రష్మికా మందన్నా... జాన్వీకపూర్ లాంటి వాళ్లు ప్రూవ్ చేసారు.
కానీ ఇది రైట్ వే కాదంటోంది సీనియర్ నటి జ్యోతిక. ప్రస్తుతం జ్యోతిక సెకెండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే `షైతాన్` తో మరో భారీ విజయం ఖాతాలో వేసుకున్నారు. మకాం చెన్నై నుంచి ముంబై కి మార్చిన తర్వాత మరింత యాక్టివ్ గా కనిపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. తాజాగా జ్యోతిక లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
`కథానాయికలకి 35 ఏళ్ల తర్వాత బలమైన పాత్రలు పోషించే అవకాశాలు వస్తుంటాయి. నేను అలాంటి వాటిపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నా. చిన్న వయసులో అలాంటి చిత్రాల కన్నా కొంత అనుభవం వచ్చిన తర్వాత మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు చేస్తే మరింత గుర్తిండిపోయే అవకాశం ఉంటుంది. బాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్లు ఇదే స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. భాషతో సంబంధం లేకుండా అలాంటి మంచి పాత్రలు ఏ పరిశ్రమలో వచ్చినా నటించడం మంచి ఛాయిస్ గా తీసుకోవాలి. నా ప్రణాళిక అలాగే వేసుకున్నా` అని అన్నారు.
బాలీవుడ్ లో రాణీ ముఖర్జీ ఇదే ప్రణాళికతో అక్కడ మంచి సక్సెస్ అయింది. ప్రస్తుతం ఆమె వయసు 46 ఏళ్లు. వయసుకు తగ్గ పాత్రలు..లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. విద్యాబాలన్ కూడా అలాగే జర్నీ చేస్తుంది. అయితే హీరోయిన్ ఛాన్సులతో పాటు ఉమెన్ సెంట్రిక్ చిత్రాలు కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తుంది.