Begin typing your search above and press return to search.

హీరోయిన్స్ కంటే ఘాటుగా జ్యోతి గ్లామర్ డోస్

అయితే ఆమె టాలీవుడ్ యంగ్ దర్శకుడు సుకు పూర్వజ్ నీ పెళ్లి చేసుకున్న తర్వాత సీరియల్స్ కి స్వస్తి చెప్పింది.

By:  Tupaki Desk   |   22 Aug 2024 1:23 PM GMT
హీరోయిన్స్ కంటే ఘాటుగా జ్యోతి గ్లామర్ డోస్
X

ప్రస్తుతం సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తెలుగు ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న ముద్దుగుమ్మలలో జ్యోతి పూర్వజ్ కచ్చితంగా టాప్ ప్లేస్ లో ఉంటుందని చెప్పొచ్చు. సీరియల్ యాక్టర్ గా జ్యోతి పూర్వజ్ కెరియర్ ప్రారంభించింది. తెలుగులో మనసు మమత సీరియల్ లో హీరో తల్లి పాత్రలో జ్యోతి రాయ్ అందరికి సుపరిచితం అయ్యింది. ఆ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి జ్యోతి రాయ్ బాగా చేరువయ్యింది. అయితే ఆమె టాలీవుడ్ యంగ్ దర్శకుడు సుకు పూర్వజ్ నీ పెళ్లి చేసుకున్న తర్వాత సీరియల్స్ కి స్వస్తి చెప్పింది.


జ్యోతి రాయ్ గా ఉన్న ఆమె పేరును జ్యోతి పూర్వజ్ గా మార్చుకుంది. సినీనటిగా ఆమె కెరియర్ బిల్డ్ చేసుకునే పనిలో పడింది. దానికి తగ్గట్లుగానే తనని తాను కంప్లీట్ గా మార్చుకుంటూ వస్తోంది. కెరియర్ ఆరంభంలో తల్లి పాత్రలకి పరిమితమైన జ్యోతి పూర్వజ్ ఇప్పుడు హాట్ లుక్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో అందరిని ఆకర్షిస్తోంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ హాట్ బ్యూటీగా తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.


ఈమె ఒక కీలక పాత్రలో నటించిన మాస్టర్ పీస్ అనే సూపర్ హీరో మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాతో నటిగా తను ఇమేజ్ పెరుగుతుందని జ్యోతి పూర్వజ్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది. దీంతోపాటు తన భర్త దర్శకత్వంలోనే మరో మూడు సినిమాలకు ఆమె కమిట్ అయ్యింది. అలాగే వేరొక ప్రొడక్షన్ లో లీడ్ రోల్ లో అవకాశం సొంతం చేసుకుంది. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. కెరియర్ పరంగా బ్రేక్ ఇచ్చే మూవీ కోసం జ్యోతి పూర్వజ్ ఎదురుచూస్తోంది.


ఇదిలా ఉంటే తాజాగా జ్యోతి పూర్వజ్ ఇన్ స్టాగ్రామ్ అదిరిపోయే ఫోటోలని షేర్ చేసింది. గ్లామరస్ లుక్స్ తో తనని తాను షోకేస్ చేసుకుంటూ గ్లామర్ పిక్స్ పంచుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లుక్స్ లో జ్యోతి పూర్వజ్ స్టార్ హీరోయిన్స్ కి కూడా పోటీ ఇచ్చే అందంతో మెరిసిపోతోందనే మాట వినిపిస్తోంది. నెటిజన్లు జ్యోతి లుక్స్, అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.