Begin typing your search above and press return to search.

మరోసారి ఘాటైన లుక్కులో సీరియల్ నటి

అలాగే శ్రీలీల కూడా ఇప్పుడు జెట్ స్పీడ్ తో అవకాశాలు అందుకుంటూ తన ఇమేజ్ ని బిల్డ్ చేసుకునే పనిలో ఉంది.

By:  Tupaki Desk   |   7 Aug 2024 1:20 PM GMT
మరోసారి ఘాటైన లుక్కులో సీరియల్ నటి
X

కన్నడ నాట నుంచి వచ్చి తెలుగు తెరపై స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వారిలో ఒకప్పుడు సౌందర్య స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. ఈ జెనరేషన్ లో పూజా హెగ్డే, రష్మిక మందన స్టార్ హీరోయిన్స్ గా వారి హవా కొనసాగిస్తున్నారు. రష్మిక మందన అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతోంది. అలాగే శ్రీలీల కూడా ఇప్పుడు జెట్ స్పీడ్ తో అవకాశాలు అందుకుంటూ తన ఇమేజ్ ని బిల్డ్ చేసుకునే పనిలో ఉంది.


ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది బ్యూటీస్ హీరోయిన్స్ గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. తెలుగు టెలివిజన్ పైన కూడా కన్నడ బ్యూటీస్ డామినేషన్ గట్టిగానే ఉంది. కన్నడ సినిమాలతో కెరియర్ స్టార్ట్ చేసిన అందాల భామ జ్యోతి రాయ్ కూడా ఇప్పుడు తెలుగు తెరపై తన ఛరిష్మా చూపించడానికి సిద్ధం అవుతోంది. గుప్పెడంత మనసు సీరియల్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జ్యోతిరాయ్ తరువాత సినిమాలపై ఫోకస్ చేసింది.


తన మొదటి భర్తకి విడాకులు ఇచ్చిన తర్వాత టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకు పూర్వజ్ ని జ్యోతిరాయ్ వివాహం చేసుకొని జ్యోతి పూర్వజ్ గా పేరు మార్చుకుంది. భర్త సహకారంతో ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ క్వీన్ గా ఈ బ్యూటీ సక్సెస్ అయ్యే పనిలో ఉంది. ఓ వైపు కన్నడ సినిమాలు చేస్తూనే తెలుగులో కూడా క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్ లలో జ్యోతి పూర్వజ్ భాగం అయ్యింది. ఆమె ఒక లీడ్ రోల్ లో ఏ మాస్టర్ పీస్ అనే సూపర్ హీరో మూవీ తెరకెక్కింది.


దీనిని ఆమె భర్త సుకు పూర్వజ్ తెరకెక్కిస్తున్నారు. మరో రెండు, మూడు సినిమాల వరకు జ్యోతి పూర్వజ్ కమిట్ అయ్యింది. వాటిలో లీడ్ క్యారెక్టర్స్ లలోనే ఆమె నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోషూట్ లని షేర్ చేసుకుంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. లక్షల్లో ఆమె ఫాలోవర్స్ ఉన్నారు.


తాజాగా రెడ్ కలర్ షర్టు పై బటన్స్ తీసేసి జ్యోతి పూర్వజ్ ఫోటోలకి ఫోజులిచ్చింది. ఇందులో ఆమె ఎర్రగులాబీలా మెరిసిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జ్యోతి హీరోయిన్ మెటీరియల్ అని అంటున్నారు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు జ్యోతికి మంచి ఛాన్స్ లు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.