లంగావోణిలో జగతి.. నడుముతోనే స్టన్ అయ్యేలా..
ఇటీవల, జ్యోతి తన గ్లామర్ ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో మరింత క్రేజ్ తెచ్చుకుంది.
By: Tupaki Desk | 25 Aug 2024 3:00 AM GMTతెలుగు టెలివిజన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన నటీమణులలో జ్యోతి రాయ్ ఒకరు. 'జగతి' పాత్రతో ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. ఇటీవల, జ్యోతి తన గ్లామర్ ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో మరింత క్రేజ్ తెచ్చుకుంది.
జ్యోతి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించి, దర్శకుడు సుకు పూర్వాజ్‌తో వివాహం చేసుకుంది. తన పేరును జ్యోతి పూర్వాజ్‌గా మార్చుకున్న ఆమె, కొత్త పేరుతోనే కాదు, కొత్త లుక్‌తో కూడా ఆకట్టుకుంటోంది. కొన్ని రోజుల క్రితం మినీ డ్రెస్సులో ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఆమె అందానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక లేటెస్ట్ గా అమ్మడు నల్లని రంగు లంగా వోణిలో అందంగా దర్శనమిచ్చింది.
గతంలో ఎన్నోసార్లు గ్లామర్ డ్రెస్సులో కనిపించిన జ్యోతి ఈ లుక్ లో ఇంకా అందంగా ఉందంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇంటర్నెట్లో జ్యోతి ఫోటోలను చూసిన అభిమానులు ఆమె స్టైల్, గ్లామర్ గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. మరింత అందంగా కనిపిస్తున్న ఆమె టాటూలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫ్యాన్స్ ఆమె లుక్‌పై పాజిటివ్ రియాక్షన్లు ఇస్తున్నారు.
అభిమానులను ఆకట్టుకుంటూ జ్యోతి తన కెరీర్లో కూడా బిజీగా ఉంది. టెలివిజన్‌లో 'గుప్పెడంత మనసు' సీరియల్ ద్వారా పాపులారిటీ పొందిన ఆమె, వెబ్ సిరీస్‌లు, సినిమాల్లోనూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం జ్యోతి తన భర్త సుకు పూర్వాజ్‌తో కలిసి ప్రముఖ చిత్ర దర్శకుడు రూపొందిస్తున్న 'ఏ మాస్టర్ పీస్' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.
ఈ చిత్రం విజయవంతమైతే, జ్యోతి కెరీర్లో కీలక మలుపు తిరగవచ్చు. గ్లామర్‌తో పాటు, తన నటనతో కూడా ప్రేక్షకులను మెప్పించడానికి జ్యోతి కృషి చేస్తోంది. తెలుగులో హీరోయిన్గా స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ నటీమణి, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.