Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : సింగిల్ పీస్ డ్రెస్ లో జగతి మేడం స్టన్నింగ్

తాజాగా స్టన్నింగ్స్ పిక్స్ షేర్ చేసింది జ్యోతి రాయ్. సింగిల్ పీస్ బ్లాక్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది.

By:  Tupaki Desk   |   8 Feb 2024 9:17 AM GMT
పిక్ టాక్ : సింగిల్ పీస్ డ్రెస్ లో జగతి మేడం స్టన్నింగ్
X

తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ తో ఫుల్ పాపులర్ అయ్యింది కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్. హీరో తల్లి పాత్రలో జగతిగా మాతృత్వం కురిపించింది. కొడుకు ప్రేమ కోసం తపించే తల్లిగా ఎమోషన్ పండించింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీసుల్లో బిజీ అయిన జ్యోతి రాయ్.. గుప్పెడంత మనసు సీరియల్ కి గుడ్ బై చెప్పింది.

జగతి పాత్రలో ఆమెను చూసి అంతా పెద్దావిడ అనుకున్నారు. కానీ జ్యోతి రాయ్ సో యంగ్. ఇటీవల తన రియల్ ఏజ్ కూడా రివీల్ చేసింది. తనకు జస్ట్ 30 ఇయర్స్ అంటూ ప్రూఫ్ తో సహా బయటపెట్టింది. మొన్నటి వరకు ఆమెకు 38 ఏళ్లు అని అందరూ భావించారు. అయితే సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటోంది జ్యోతి. గ్లామరస్ ఫొటో షూట్స్ తో అమ్మడు కుర్రాళ్ల గుండెల్లో రేపుతోంది.

తాజాగా స్టన్నింగ్స్ పిక్స్ షేర్ చేసింది జ్యోతి రాయ్. సింగిల్ పీస్ బ్లాక్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. సూపర్ గ్లోయింగ్ స్కిన్ తో మైమరిపిస్తోంది. చిన్న చిరునవ్వుతో ఫిదా చేస్తోంది. అందమంతా తనలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. కొంటె చూపుతో అట్రాక్ట్ చేస్తోంది. బ్యూటీ అనే పదానికి ఇమేజ్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.

కర్ణాటకకు చెందిన జ్యోతి రాయ్ మోడల్‌ గా కెరీర్‌ ను మొదలు పెట్టింది. తనదైన గ్లామర్‌ తో మాయ చేసింది. బందె బరాటవ కాలా సీరియల్ తో నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. దక్షిణాదిలో వరుసగా సీరియళ్లు చేస్తూ పాపులర్ అయిన జ్యోతి రాయ్.. అప్పట్లోనే కన్యాదానంతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని గుప్పెడంత మనసుతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

రెండు దశాబ్దాలుగా వరుస పెట్టి సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌ లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న జ్యోతి రాయ్ ఇప్పుడు.. నో మోర్ సీక్రెట్స్ , ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్‌ లలో నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌ లో రూపొందుతున్న ప్రెట్టీ గర్ల్ వెబ్ సిరీస్‌ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. జ్యోతి రాయ్ బాత్ టబ్‌ పై కూర్చుని ఉన్న పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది.