Begin typing your search above and press return to search.

టెలివిజన్ బ్యూటీ.. బికినీ కంటే అందంగా..

ఆమె డ్రెస్ బికినీ కంటే చాలా అందంగా ఉంది అని కూడా మరికొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కొన్ని గంటల్లోనే ఆ ఫొటో వైరల్ గా మారిపోయింది.

By:  Tupaki Desk   |   30 April 2024 12:30 PM GMT
టెలివిజన్ బ్యూటీ.. బికినీ కంటే అందంగా..
X

ఇటీవల కాలంలో కేవలం సినిమా హీరోయిన్స్ మాత్రమే కాకుండా టెలివిజన్ కథానాయకులు కూడా వారి గ్లామర్ తో ఎంతగానో అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే మోడల్స్ కంటే మేము తక్కువేమీ కాదు అనే రేంజ్ లో కూడా మరికొందరు గ్లామర్ తో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో మంచి గుర్తింపు అందుకున్న టెలివిజన్ బ్యూటీలలో మాత్రం జ్యోతి రాయ్ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు.

జగతి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ అమ్మడు రీసెంట్గ గా ఒక దర్శకుడుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సుకు పూర్వాజ్ ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో అమ్మడు తన పేరును కూడా మార్చేసుకుంది. ప్రస్తుతం జ్యోతి పూర్వాజ్ గా కొనసాగుతున్న ఆమె సోషల్ మీడియాలో కూడా చురుగ్గా దర్శనమిస్తోంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.

ఇంతకుముందు కూడా ఆమె గ్లామరస్ ఫోటోలతో ఎంతగానో అట్రాక్ట్ చేసింది. అయితే ఈ లుక్కులో మాత్రం మరింత అందంగా ఉంది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఫోటోలో ఆమె అందాల దేవతల కనిపిస్తోంది.. ఆమె డ్రెస్ బికినీ కంటే చాలా అందంగా ఉంది అని కూడా మరికొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కొన్ని గంటల్లోనే ఆ ఫొటో వైరల్ గా మారిపోయింది.

ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు వారికి బాగా దగ్గరైంది. అనంతరం సోషల్ మీడియా ద్వారా యూత్ ను అట్రాక్ట్ చేసింది. జ్యోతి రాయ్ భర్త సుకు పూర్వాజ్‌ మాట రాని మౌనమిది, శుక్ర చిత్రాల దర్శకుడు. సుకు పూర్వాజ్‌ ను ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. ఇక ప్రస్తుతం అతను ఏ మాస్టర్ పీస్ సినిమా తీస్తున్నారు.

అందులో జ్యోతి కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లు, సినిమాలతో బిజీగా ఉన్న జ్యోతి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. భవిష్యత్తు లో హీరోయిన్ గా స్థిరపడాలాని ఈ కన్నడ అమ్మాయి కృషి చేస్తోంది. మరి రాబోయే ప్రాజెక్టులు అమ్మడికి ఎలాంటి విజయాలను అందిస్తాయో చూడాలి.