Begin typing your search above and press return to search.

జ్యోతి రాయ్.. ఇలా చాలా రేర్!

కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ కు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 May 2024 12:30 AM GMT
జ్యోతి రాయ్.. ఇలా చాలా రేర్!
X

కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ కు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఒక్క సీరియల్ తో ఇక్కడ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో యాక్ట్ చేసి ఆకట్టుకుంది. జగతి పాత్రలో అమ్మగా, టీచర్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. సీరియల్ లో చీరల్లో కనిపించి ఫిదా చేసింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీసుల్లో అవకాశాలు దక్కించుకుంది. దీంతో ఆ సీరియల్ నుంచి బయటకు వచ్చేసింది.


ఇక సీరియల్ లో మేకర్స్ ఆమె రోల్ ను చంపేసి కొత్త క్యారెక్టర్ ను ప్రవేశ పెట్టారు. అయితే సీరియల్ లో చీరల్లో పద్ధతిగా కనిపించిన జ్యోతి.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంటోంది. పొట్టి బట్టలు, ట్రెండీ ఔట్ ఫిట్స్ లో అలరిస్తుంటోంది. గ్లామర్ గేట్లు ఎత్తేసి మాయ చేస్తుంటోంది. మినీ స్కర్ట్, పొట్టి టాప్స్ లోనే కుర్రాళ్లను మతులు పోగుడుతుంటోంది. రోజురోజుకు బట్టల సైజును కూడా తగ్గించేస్తుంటోంది!


తాజాగా చీరలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది జ్యోతి రాయ్. ప్లెయిన్ శారీలో దిగిన పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేసింది. ట్రెడిషనల్ మీట్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. హెయిర్ లీవ్ చేసి వయ్యారాలు ఒలకబోసింది. ఒక ఫొటోలో కొంగు చాటున నడుము అందాలు చూపించి మైమరపించింది. మొత్తానికి చీరలో కూడా గ్లామర్ షో చేయొచ్చని నిరూపించింది. ప్రస్తుతం ఆమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


చీరలో జ్యోతి రాయ్ ను చూసి షాకయ్యామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ట్రెడిషనల్ గా కూడా సూపర్బ్ గా ఉన్నారని కొనియాడుతున్నారు. అప్పుడప్పుడు చీరల్లో అందాలు ఆరబోయండంటూ సరదాగా రిక్వెస్ట్ పెడుతున్నారు. అందానికి జ్యోతి రాయ్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఎవరైనా జ్యోతి లుక్స్ కు ఫ్లాట్ అవ్వకుండా ఉంటారా? అని అంటున్నారు. ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ సందడి చేస్తున్నారు.

అయితే మొదటి భర్తతో విడాకులు తీసుకున్న జ్యోతి రాయ్.. కొన్ని నెలల క్రితం యంగ్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టింది. మాట రాని మౌనమిది, శుక్ర సినిమాల దర్శకుడు సుకు పుర్వాజ్‌ ను జ్యోతి రాయ్ రెండో వివాహం చేసుకుంది. ఏ మాస్టర్ పీస్ మూవీలో జ్యోతి రాయ్ నటించగా.. పూర్వాజ్ తెరకెక్కించారు. ఆ సినిమా టైమ్ లో వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి జ్యోతి రాయ్ పిక్స్ ను మీరు చూశారా లేదా?